One Biryani Rs.3 lakh : ఒకే ఒక్క బిర్యానీ బిల్లు రూ.3.20 ల‌క్ష‌లు..

ఒకే ఒక్క బిర్యానికి ఏకంగా రూ.3.20లక్షలు బిల్లు వేసేసరికి షాక్ అయితీరుతాం.అదే జరింగింది పశ్చిమ బెంగాల్ లో ఓ సూప‌రింటెండెంట్ కి. ఒకే ఒక్క బిర్యానికి వేసిన బిల్లు చూసి షాక్ అయ్యాడు. అలాగని ఆ బిర్యాని ఏదో స్పెషల్ ది కూడా కాదు. ఇంతకీ ఏమా బిర్యానీ ధర కథా కమామీషు అంటే..

One Biryani Rs.3 lakh : ఒకే ఒక్క బిర్యానీ బిల్లు రూ.3.20 ల‌క్ష‌లు..

Rs 3.20 Lakh Bill For Biryani At Katwa Sub Divisional Hospital

 

west bengal : బిర్యాని పేరు చెబితేనే నోరు ఊరిపోతుంది. అటువంటి బిర్యానికి బిల్లు భారీగా వేసినా మహా అయితే రూ.150 నుంచి 300లు ఉంటుంది. అదే ఏ స్పెషల్ బిర్యానీయో అయితే మరో 50 రూపాయలు ఎక్కువుంటుందేమో. కానీ ఒకే ఒక్క బిర్యానికి ఏకంగా రూ.3.20లక్షలు బిల్లు వేసేసరికి షాక్ అయితీరుతాం.అదే జరింగింది పశ్చిమ బెంగాల్ లో ఓ సూప‌రింటెండెంట్ కి. ఒకే ఒక్క బిర్యానికి వేసిన బిల్లు చూసి షాక్ అయ్యాడు. అలాగని ఆ బిర్యాని ఏదో స్పెషల్ ది కూడా కాదు. ఇంతకీ ఏమా బిర్యానీ ధర కథా కమామీషు అంటే..

ప‌శ్చిమ బెంగాల్ ఈస్ట్ బ‌ర్ధామ‌న్ జిల్లాలోని క‌త్వా స‌బ్ డివిజ‌న్ ఆస్ప‌త్రికి కింగ్ షూక్ గోష్ అనే కాంట్రాక్ట‌ర్ ఫ‌ర్నీచ‌ర్, వాహ‌నాల‌తో పాటు బిర్యానీ కూడా స‌ర‌ఫ‌రా చేస్తుంటాడు. ఈక్రమంలో ఇటీవల కత్వా సబ్ డివిజన్ఆస్ప‌త్రికి సౌవిక్ ఆలం అనే కొత్త సూప‌రింటెండెంట్ నియమితులయ్యారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల‌ను క్లియ‌ర్ చేయాల‌ని సూపరింటెండెంట్ అధికారుల‌ను ఆదేశించాడు. కొత్త సూపరింటెండెంట్ వచ్చారు. పాత బకాయిలన్నీ వసూలు చేసుకుందామనుకున్నాడు షూక్ గోష్. దీంతో రూ.82,000 విలువైన ఫర్నీచర్ ఇలా కోటి రూపాయల బిల్లులన్నీ సూపరింటెండెంట్ సౌవిక్ ఆలం ముందు పెట్టాడు. వాటిని పరిశీలించిన ఆయన ఓ బిర్యాని బిల్లు చూడా షాక్ అయ్యాడు.

కాంట్రాక్ట‌ర్ స‌మ‌ర్పించిన బిల్లుల్లో 81 బిల్లుల‌ను బోగ‌స్‌ బిల్లులుగా గుర్తించాడు. ఎందుకంటే దాంట్లో ఓ బిర్యానీ బిల్లు రూ. 3.20 ల‌క్ష‌లుగా ఉంది. దీంతో సూప‌రింటెండెంట్ షాక్ అయ్యారు. క్ష‌ణం ఆలోచించ‌కుండా పేషెంట్ వెల్ఫేర్ క‌మిటీతో సౌవిక్ ఆలం స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ బోగస్ బిల్లులను డిపాజిట్ చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు సూపరింటెండెంట్. వైద్య ఆరోగ్య శాఖ కూడా నకిలీ బిల్లుల విషయాన్ని ధ్రువీకరించింది. ఆ బిల్లును ఆమోదించిన ప్రతి ఒక్కరిని విచారిస్తామని, దోషులగా రుజువైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎంఓహెచ్-2 డాక్టర్ సుబర్నో గోస్వామి  తెలిపారు.

కత్వా ఆసుపత్రిలో ‘భారీ’ బిల్లు సంచలనానికి దారితీసింది. కత్వా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ ఛటర్జీ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు. దీని వెనుక ఏదో ఒప్పందం ఉందని అనుమానిస్తున్నాం అని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ ఛటర్జీ అన్నారు.