Mid-Day Meals: మధ్యాహ్న భోజనంలో నాన్ వెజ్.. వారానికోసారి చికెన్, గుడ్లు, పండ్లు ఇవ్వనున్న బెంగాల్ ప్రభుత్వం

ప్రస్తుతం అందిస్తున్న భోజనంతోపాటే, ఆలూ, సోయా బీన్స్, గుడ్లు, చికెన్, సీజనల్ ఫ్రూట్స్ కూడా అందించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. వారానికోసారి చికెన్, పండ్లు అందిస్తారు. దీనికోసం అదనంగా రూ.371 కోట్లు కేటాయించింది. అంటే ప్రతి విద్యార్థికి వారానికి అదనంగా రూ.20 కేటాయిస్తున్నారు.

Mid-Day Meals: మధ్యాహ్న భోజనంలో నాన్ వెజ్.. వారానికోసారి చికెన్, గుడ్లు, పండ్లు ఇవ్వనున్న బెంగాల్ ప్రభుత్వం

Mid-Day Meals: మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు చికెన్, గుడ్లు, పండ్లు అందించేందుకు సిద్ధమైంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. జనవరి నుంచి వచ్చే ఏప్రిల్ వరకు ఈ పథకం అమలవుతుంది. ప్రధాన మంత్రి పోషణ్ పథకం కింద అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకానికి అదనంగా, నిధులు సమకూర్చి వీటిని అందించనుంది.

MCD Mayoral Elections: నేడే ఢిల్లీ మేయర్ ఎన్నిక.. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ నేతను నియమించిన ఎల్జీ.. మండిపడ్డ ఆప్

ప్రస్తుతం అందిస్తున్న భోజనంతోపాటే, ఆలూ, సోయా బీన్స్, గుడ్లు, చికెన్, సీజనల్ ఫ్రూట్స్ కూడా అందించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. వారానికోసారి చికెన్, పండ్లు అందిస్తారు. దీనికోసం అదనంగా రూ.371 కోట్లు కేటాయించింది. అంటే ప్రతి విద్యార్థికి వారానికి అదనంగా రూ.20 కేటాయిస్తున్నారు. ప్రస్తుతానికి ఏప్రిల్ వరకే ఈ పథకం కొనసాగించాలని నిర్ణయించినప్పటికీ, ఆ తర్వాత కొనసాగిస్తారో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్‌లో పంచాయతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంతో మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో 1.16 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు.

Weather Report: తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత… ఏపీకి స్వల్ప వర్ష సూచన

వీళ్లందరికీ మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. దీనికి ఖర్చయ్యే నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం, కేంద్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరిస్తాయి. ప్రస్తుతం కేటాయించిన నిధులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. ఇన్నాళ్లూ అన్నం, పప్పులు వంటివి మాత్రమే ఇచ్చి.. ఇప్పుడు ఉన్నట్లుండి చికెన్ కూడా ఇవ్వాలనుకోవడానికి కారణం ఎన్నికలే అని, రాజకీయ కోణంలో మాత్రమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ విమర్శిస్తోంది.