Weather Report: తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత… ఏపీకి స్వల్ప వర్ష సూచన

దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లో స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. రాయలసీమలో పొడి వాతావరణం ఉంటుంది. మరోవైపు తెలంగాణలో వాతావరణం పొడిగానే ఉండే అవకాశం ఉంది. అయితే, చలి తీవ్రత పెరిగింది.

Weather Report: తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత… ఏపీకి స్వల్ప వర్ష సూచన

Updated On : January 6, 2023 / 9:22 AM IST

Weather Report: రాబోయే రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లో స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది.

MCD Mayoral Elections: నేడే ఢిల్లీ మేయర్ ఎన్నిక.. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ నేతను నియమించిన ఎల్జీ.. మండిపడ్డ ఆప్

రాయలసీమలో పొడి వాతావరణం ఉంటుంది. మరోవైపు తెలంగాణలో వాతావరణం పొడిగానే ఉండే అవకాశం ఉంది. అయితే, చలి తీవ్రత పెరిగింది. అక్కడక్కడా స్వల్పంగా వర్షాలు కురవొచ్చు. ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. రాబోయే ఐదు రోజులపాటు ఇక్కడ ఉష్ణోగ్రతలు సాధారణంకంటే మరింత తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులపాటు రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు, ఎల్లుండి నిజామాబాద్, జగిత్యాల, మెదక్, హైదరాబాద్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు 19 డిగ్రీలు, 28 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది.

ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే స్వల్పంగా వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ నగరంలో 36 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలు ప్రభావం ఎక్కువగా ఉంది. ఢిల్లీ, హరియాణా, చండీగఢ్, అమృత్‌సర్ ప్రాంతాలు చలితో వణుకుతున్నాయి.