ఆదివాసీ ఇంటికెళ్లి అరిటాకులో భోజనం చేసిన అమిత్ షా..

  • Published By: nagamani ,Published On : November 6, 2020 / 11:54 AM IST
ఆదివాసీ ఇంటికెళ్లి అరిటాకులో భోజనం చేసిన అమిత్ షా..

West Bengal : Amit Shah Eats Lunch At Tribal House : బీజేపీ సీనియర్ నేత కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షా ఓ ఆదివాసీ ఇంటికెళ్లి భోజనం చేసారు. పశ్చిమబెంగాల్ పర్యటించిన సందర్భంగా షా బంకుర జిల్లాలోని ఛతుర్ధి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తగా వీభీషణ్ హన్సడా ఇంట్లో భోజనం చేశారు.


పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన ఓ ఆదివాసీ కార్యకర్త వీభీషణ్ హన్సడా ఇంట భోజనం చేశారు. అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గియా, జాతీయ ఉపాధ్యక్షుడు ముఖుల్ రాయ్, రాష్ట్ర పార్టీ చీఫ్ దిలీప్ ఘోష్ లు సైతం అక్కడే భోజనం చేశారు. తన అభిమాన నేతలకు భోజన సదుపాయాలను కల్పించే అవకాశం లభించినందుకు వీభీషణ్ హన్సడా తెగ ఆనందపడిపోయాడు. ఇది తన భాగ్యం అంటూ మురిసిపోయాడు.



https://10tv.in/shah-rukh-khan-says-he-can-eat-these-three-foods-for-the-rest-of-his-life/
తమ అభిమాన నేతల కోసం విబీషణ్ హన్సాడా పూర్తి శాకాహార విందును ఏర్పాటు చేసాడు. అరిటాకులో వాటిని వడ్డించగా, నేతలంతా నేలపైనే కూర్చుని భోజనం చేశారు. ఈ భోజనంలో అన్నం, పప్పు, పటోలా భాజా, షుక్తో, ఆలూ పోస్టో, పాపడ్ తదితరాలతో పాటు రసగుల్లా, సందేశ్, మిష్టీ డోయి వంటి స్వీట్స్ ను వడ్డించారు.


భోజనం అనంతరం, అమిత్ షా ఆ కార్యకర్త కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. మంచి చెడ్డలు అడిగి తెలుసుకున్నారు. మీకు మేమంతా ఉన్నామని భరోసా ఇచ్చారు. అనంతరం షా స్థానికులతో కాసేపు మాట్లాడారు. అమిత్ షా వంటి నేత తన ఇంటికి వచ్చి భోజనం చేయడం, తనకు లభించిన అదృష్టమని, ఇది తన జీవితాంతం గుర్తుండిపోతుందని హన్సడా ఆనందం వ్యక్తంచేస్తూ తెలిపాడు.