2020లో ఏమైనా జరగొచ్చు.. కరోనాకు తోడు భూకంపాలు.. మీమీస్‌ వైరల్

2020లో ఏమైనా జరగొచ్చు.. కరోనాకు తోడు భూకంపాలు.. మీమీస్‌ వైరల్

Memes Rock Twitter Earthquake Strikes Rajasthan Tremors Felt in Delhi Memes : 2020లో ఏమైనా జరగొచ్చు.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.. మహమ్మారి వైరస్ లు విజృంభిస్తున్నాయి.. భూకంపాలు సంభవిస్తున్నాయి.


ఈ 2020 అంతా కరోనా భయంలోనే గడిచిపోయింది. కరోనా తగ్గిందిలే అనుకున్న తరుణంలో భూకంపాలు మొదలయ్యాయి. దేశీయ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో రాత్రి 11.46 గంటల సమయంలో ఒక్కసారిగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.


రాజస్థాన్‌లో రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాజస్థాన్‌లో అల్వర్ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు జాతీయ కేంద్రమైన సిస్మాలాజీ వెల్లడించింది.


ఈ ఏడాదిలో ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూకంపాలు రావడం తొలిసారి కాదు.. హర్యానాలోని నైరుతి గుర్గావ్ ప్రాంతానికి 63కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది.


భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైంది. ఢిల్లీ-ఎన్ సీఆర్ సహా పలు ప్రాంతాల్లో వరుసగా అడపాదడపా స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.


భూప్రకంపనలపై సోషల్ మీడియాలో మీమీలు, జోకులను నెటిజన్లు సరదాగా ట్వీట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. 2020లో ఏమైనా జరగొచ్చు అంటూ జోకులు పేలుస్తూ మీమీలను షేర్ చేస్తున్నారు.