Ambedkar Pic on Currency: కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మ.. కేజ్రీవాల్‭కు కౌంటర్‭గా డిమాండ్ లేవనెత్తిన కాంగ్రెస్

గురువారం కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ మనీష్ తివారి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘కొత్త సిరీస్ కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటో ఎందుకు ఉండకూడదు? నోటుకు ఒకవైపు ఘనతవహించిన మహాత్మా గాంధీ బొమ్మ, మరో వైపు డాక్టర్ అంబేద్కర్ బొమ్మ ఉండాలి. అహింస, రాజ్యాంగవాదం, సర్వసమానత్వం విశిష్ట సమ్మేళనంలో లీనమవుతాయి. అలాంటపుడు ఆధునిక భారతీయ బుద్ధి కుశలత అత్యంత కచ్చితమైన రీతిలో వ్యక్తమవుతుంది’’ అని రాసుకొచ్చారు.

Ambedkar Pic on Currency: కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మ.. కేజ్రీవాల్‭కు కౌంటర్‭గా డిమాండ్ లేవనెత్తిన కాంగ్రెస్

Why not Ambedkar picture on currency notes asks Manish Tewari

Ambedkar Pic on Currency: కరెన్సీ నోట్లపై దేవతామూర్తులైన గణేష్, లక్ష్మీల బొమ్మలు ముద్రించాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మను ముద్రించాలనే డిమాండ్‭ను కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది. అంబేద్కరిస్టులు సహా కొంత మంది లౌకిక వాదులు ఈ డిమాండ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. అయితే 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ నుంచి.. ఇలాంటి డిమాండ్ రావడం పట్ల కొంత ఆశ్చర్యం, కొంత ఆసక్తిని రేపుతోంది.

గురువారం కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ మనీష్ తివారి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘కొత్త సిరీస్ కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటో ఎందుకు ఉండకూడదు? నోటుకు ఒకవైపు ఘనతవహించిన మహాత్మా గాంధీ బొమ్మ, మరో వైపు డాక్టర్ అంబేద్కర్ బొమ్మ ఉండాలి. అహింస, రాజ్యాంగవాదం, సర్వసమానత్వం విశిష్ట సమ్మేళనంలో లీనమవుతాయి. అలాంటపుడు ఆధునిక భారతీయ బుద్ధి కుశలత అత్యంత కచ్చితమైన రీతిలో వ్యక్తమవుతుంది’’ అని రాసుకొచ్చారు.

భారత కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేషుడి బొమ్మలు ముద్రించాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేషుడి బొమ్మలు ముద్రించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇండోనేషియా ఓ ముస్లిం దేశం..అక్కడ హిందువులు కేవలం రెండు శాతం మాత్రమే ఉంటారు. అటువంటి ఇండోనేషియా కరెన్సీపై హిందూ దేవుడైన గణేషుడు బొమ్మను ముద్రించారని..అటువంటిది మన భారత కరెన్సీపై దేవతల బొమ్మలు ముద్రించాలని కోరారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాలో మాట్లాడుతూ ఈ ప్రతిపాదన చేశారు.

AAP vs BJP: డంపింగ్ యార్డ్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కేజ్రీవాల్.. వ్యూహాత్మకంగా బీజేపీపై దాడి