AAP vs BJP: డంపింగ్ యార్డ్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కేజ్రీవాల్.. వ్యూహాత్మకంగా బీజేపీపై దాడి

డంపింగ్ యార్డు పరిశీలన అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఢిల్లీకి భారతీయ జనతా పార్టీ ఏమీ ఇవ్వలేదు. ఏమైనా ఇచ్చిందంటే అది కొండంత చెత్తను మాత్రమే ఇచ్చింది. 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీపై అధికారం చెలాయిస్తున్న బీజేపీ.. ఈరోజు గాజీపూర్ వచ్చి ఇక్కడి డంపింగ్ యార్డ్ చూస్తే ఇన్నాళ్లు ఏం చేసిందో తెలుస్తుంది. అందుకే ఢిల్లీలోని బీజేపీ కార్యకర్తలకు, సానుభూతి పరులకు నేను ఒక విజ్ణప్తి చేయదల్చుకున్నాను

AAP vs BJP: డంపింగ్ యార్డ్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కేజ్రీవాల్.. వ్యూహాత్మకంగా బీజేపీపై దాడి

BJP gave nothing to Delhi except mountains of garbage says Kejriwal

AAP vs BJP: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీపై జెండా పాతినప్పటికీ.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని చవి చూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఎలాగైనా గట్టెక్కించేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. ఇందుకు భారతీయ జనతా పార్టీ కంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించారు. పైగా ఒక డంపింగ్ యార్డ్ నుంచి ఎన్నికల ప్రచార వ్యూహాన్ని ప్రారంభించడం గమనార్హం. ఎన్నికల ప్రచారం ప్రారంభిచినట్లు పార్టీ అధికారికంగా ప్రకటించనప్పటికీ, మున్సిపల్ ఎన్నికలు లక్ష్యంగానే ఈ అడుగులని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఢిల్లీలోని గాజీపూర్‭లో ఉన్న డంపింగ్ యార్డును ఆప్ నేతలు, అధికారులతో కలిసి గురువారం కేజ్రీవాల్ సందర్శించారు. డంపింగ్ యార్డును మొత్తాన్ని పరిశీలించి, భవిష్యత్తులో చేయాల్సిన మార్పుల గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. కాగా, ఢిల్లీ అభివృద్ధిలో గత ప్రభుత్వాలు చాలా అలక్ష్యం వహించాయని ఆయన దుయ్యబట్టారు. 15 ఏళ్లుగా మున్సిపాలిటీలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ.. ఢిల్లీ అభివృద్ధికి ఏం చేసిందంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు.

డంపింగ్ యార్డు పరిశీలన అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఢిల్లీకి భారతీయ జనతా పార్టీ ఏమీ ఇవ్వలేదు. ఏమైనా ఇచ్చిందంటే అది కొండంత చెత్తను మాత్రమే ఇచ్చింది. 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీపై అధికారం చెలాయిస్తున్న బీజేపీ.. ఈరోజు గాజీపూర్ వచ్చి ఇక్కడి డంపింగ్ యార్డ్ చూస్తే ఇన్నాళ్లు ఏం చేసిందో తెలుస్తుంది. అందుకే ఢిల్లీలోని బీజేపీ కార్యకర్తలకు, సానుభూతి పరులకు నేను ఒక విజ్ణప్తి చేయదల్చుకున్నాను. ఒకసారి మీ పార్టీని వదిలేసి దేశం కోసం ఓట్ వేయండి’’ అని అన్నారు.

TRS MLAs trap issue : ఫాంహౌజ్ ఘటన టీఆర్ఎస్ డ్రామా..అక్కడ దొరికిన డబ్బు ఎక్కడుంచి వచ్చింది? ఎవరిదో బయటపెట్టాలి : కిషన్ రెడ్డి