Wife and Husband : రోజుకు రెండుస్లార్లు సారీలు చెబితేనే కాపురానికి వస్తా : భర్తకు భార్య వింత కండిషన్

ప్రతీరోజు లేవగానే ఒక సారి క్షమాపణ చెప్పాలి. సాయంత్రం మరోసారి క్షమాపణలు చెప్పాలని భర్తకు కండిషన్ పెట్టింది భార్య. రోజుకు రెండుసార్లు సారీ చెప్పాలని లేదంటే కాపురానికి రాను అంటూ తెగేసి చెప్పింది.

Wife and Husband : రోజుకు రెండుస్లార్లు సారీలు చెబితేనే కాపురానికి వస్తా : భర్తకు భార్య వింత కండిషన్

agra man say sorry to wife twice a day

Husband saying sorry to wife two times a day : రోజుకు రెండుసార్లు సారీ చెబితేనే కాపురానికి వస్తాను లేదంటే నీకు నాకు సంబంధం లేదు అంటూ తెగేసి చెప్పేసింది ఓ మహిళ తన భర్తకు. అలా ప్రతీరోజు లేవగానే ఒక సారి క్షమాపణ చెప్పాలి. సాయంత్రం మరోసారి క్షమాపణలు చెప్పాలని భర్తకు కండిషన్ పెట్టింది భార్య. అలా 15 రోజుల పాటు రోజుకు రెండుసార్లు సారీ చెప్పాలని లేదంటే కాపురానికి రాను అంటూ తెగేసి చెప్పింది. దీంతో సదరు భర్త కండిషన్ కు అంగీకరించాడు. దీంతో ఆమె కాపురానికి వచ్చింది. ఇదంతా చూస్తుంటే ‘పాపం ఆ భర్త’ అనుకుంటున్నారా..? కానే కాదు. ఆమె భర్తకు పెట్టిన కండిషన్ వెనుక ఓ కారణం ఉంది. అదేమంటే…

ఆగ్రాలో ఓ కుటుంబం కాపురం ఉంటోంది. భార్యా, భర్త, ఇద్దరు పిల్లలున్న చిన్న కుటుంబం అది. భర్త ఐదో తరగతి చదివాడు. భార్య బీఏ చదివింది. ఇద్దరు చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్నారు. చాలీ చాలని జీతాలు. దీంతో భార్య కుటుంబం కోసం మరికాస్త కష్టపడదామని మరో చిన్న ఉద్యోగం వెతుక్కుంది. ఆమె కాస్త చదువుకున్నది కావటంతో రెండు ఉద్యోగాలు చేస్తోంది.మొదట్లో బాగానే ఉంది. చాలీచాలనీ డబ్బుకు మరికొంత డబ్బు రావటంతో గతం కంటే కాస్త మెరుగ్గా ఉంది కుటుంబ పోషణ. ఓపక్క కుటుంబం నడపటం..ఇద్దరు పిల్లలను చూసుకోవటం, మరోపక్క రెండు ఉద్యోగాలతో ఆమె ఫుల్ బిజీ అయిపోయింది.

Minister KTR : మహిళా రిజర్వేషన్ కోసం నా సీటు పోయినా పర్వాలేదు : మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

దీంతో భర్తలో అనుమానం మొదలైంది భార్యమీద. అనుమానం పెనుభూతం అంటారు కదా..అలా అది మరింతగా పెరిగి భార్యపై అనుమానం పెరిగిపోవటంతో ఆమెను మాటలతో సతాయించటం మొదలుపెట్టాడు. అలా దంపతుల మధ్య గొడవలకు దారి తీసింది. భర్త నుంచి సూటీ పోటీ మాటలు పెరిగాయి. అవి క్రమేపీ వేధింపులుగా మారాయి. విషయం అర్థమైంది. విషయాన్ని వివరించింది భర్తకు. కానీ అనుమానం వల్ల భార్య చెప్పినమాటలేవీ బుర్రకెక్కలేదు. దీంతో ఆమె భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తకు కూడా భార్యపై కోపం పెరిగింది. అలా చాలాకాలం దూరంగా ఉండిపోయారు.

దీంతో అమ్మానాన్నలు ఇద్దరు వేరు వేరుగా ఉండటంతో ఆ ప్రభావం పిల్లలలపై పడింది. దీంతో ఈ గొడవ కాస్తా ఆగ్రాలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ కు వెళ్లింది. దీంతో ఇద్దరిని కూర్చోపెట్టి మాట్లాడారు. భార్యపై ఎన్నో ఫిర్యాదులు చేశాడు. అలాగే భర్త వేధింపుల్ని ఏకరువు పెట్టింది భార్య. తన భర్త ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని నెలకు వచ్చే సంపాదనతో కుటుంబాన్ని నడపటం కష్టమైందని అందుకే తాను పిల్లల భవిష్యత్తు కోసం అదనంగా కష్టపడేందుకు సిద్ధమయ్యానని అయినా భర్త అర్థం చేసుకోకుండా తనపై అనుమానంతో వేధిస్తున్నాడని చెప్పి వాపోయింది.దీంతో కౌన్సిలింగ్ చేసే వాళ్లు అతనికి పలు విధాలుగా నచ్చ చెప్పారు. మీ కుటుంబం కోసమే కదా ఇద్దరు కష్టపడుతున్నారు..ఆమె మరికొంత కష్టపడుతోంది. దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు.

దీంతో సరదు భర్త దారికొచ్చాడు. ఇద్దరం కలిసి ఉంటామని చెప్పాడు. కానీ భార్య మాత్రం అంగీకరించాలేదు. తన కష్టాన్ని అర్థం చేసుకోకపోవటమే కాకుండా తనపై అనుమానం పెంచుకుని వేధించటం తాను భరించలేకపోతున్నానని వాపోయింది. కానీ పిల్లల కోసం రాజీ పడతానని దానికి ఓ కండిషన్ తో మాత్రమే ఒప్పుకుంటానని స్పష్టంచేసింది. అదే ఈ క్షమాపణల కండిషన్. రోజు తన భర్త 15 రోజుల పాటు ఉదయం సాయంత్రం రోజుకు రెండు సార్లు తనను క్షమాపణల అడగాలని కండిషన్ పెట్టింది. దానికి భర్త అంగీకరించాడు. ఇది శిక్ష అనుకున్నా ఫరవాలేదంది. భార్యపిల్లలకు దూరమై తన తప్పు తెలుసుకున్న అతడు భార్య వేసిన శిక్షకు అంగీకరించాడు. ఆమె కోరినట్టే 15 రోజుల పాటు పొద్దున్నా సాయంత్రం సారీ చెబుతానని మాటిచ్చాడు. దీంతో, వారి కాపురం చక్కబడింది.