Parliament : పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు.

నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 23 వరకు నిర్వహించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినేట్‌ కమిటీ (సీసీపీఏ) సిఫార్సు చేసింది.

Parliament : పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు.

Parliament

Parliament : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 23 వరకు నిర్వహించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినేట్‌ కమిటీ (సీసీపీఏ) సిఫార్సు చేసింది. ఉభయ సభల సెక్రటేరియట్లు శీతాకాల సమావేశాల తేదీలను అధికారికంగా ప్రకటిస్తాయి. కాగా పార్లమెంట్ శీతాకాల సమావేశల నిర్వహణకు సంబంధించి రాజ్ నాథ్ నేతృత్వంలోని సీసీపీఏ అక్టోబర్ చివరివారంలో సమావేశమైంది.

చదవండి : Ruckus in Parliament : భారత చట్టసభల్లోనే కాదు.. ఆ దేశ పార్లమెంట్లలోనూ ఇదే రచ్చ!

కరోనాతోపాటు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోని ఈ తేదీలు వీలుగా ఉంటాయని కమిటీ నిర్దారణకు వచ్చింది. ఇక 19 రోజులపాటు ఎగువ, దిగువ సభల సమావేశాలు జరగనున్నాయి. కరోనా కారణంగా గతేడాది శీతాకాల సమావేశాలు జరగలేదు. కొవిడ్ నిబంధనల మధ్య జరిగిన వర్షాకాల సమావేశాల్లో రైతు ఉద్యమంపై రచ్చ జరగడంతో సభా వ్యవహారాలు సజావుగా సాగకుండానే సమావేశాలు ముగిశాయి.

చదవండి : New Parliament: వచ్చే ఏడాది ఆగస్ట్ 15 నాటికి పార్లమెంటు కొత్త భవనం సిద్ధం

శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకడం. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం ఏడాది దాటడం.. యూపీలో రైతులపై హింసాకాండ, సరిహద్దులో చైనా దూకుడుగా వ్యవహరించడం అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.