Woman abuses: గేటు తీయడం ఆలస్యమైందని సెక్యూరిటీ గార్డుపై మహిళ దాడి.. పోలీస్ కేసు నమోదు

మెయిన్ గేటు తీయడం కాస్త ఆలస్యమైనందుకు సెక్యూరిటీ గార్డుపై దాడికి యత్నించిందో మహిళ. ఈ ఘటన నోయిడాలో జరిగింది. ఈ ఘటనను వీడియో తీయగా, అదిప్పుడు వైరల్‌గా మారింది.

Woman abuses: గేటు తీయడం ఆలస్యమైందని సెక్యూరిటీ గార్డుపై మహిళ దాడి.. పోలీస్ కేసు నమోదు

Woman abuses: గేటు తీయడం కాస్త ఆలస్యమైనందుకు సెక్యూరిటీ గార్డుపై దాడికి యత్నించిందో మహిళ. అంతేకాదు.. ఆ గార్డుపై బూతులతో విరుచుకుపడింది. ఈ ఘటనను అక్కడి వాళ్లు వీడియో తీయగా అది వైరల్‌గా మారింది. నోయిడాలోని సెక్టార్-126లో ఒక పోష్ రెసిడెన్షియల్ సొసైటీలో ఈ ఘటన జరిగింది.

Wedding card: ట్యాబ్లెట్ షీట్ కాదు.. పెండ్లి పత్రిక.. నెటిజన్లను ఆకర్షిస్తున్న వెడ్డింగ్ కార్డ్

అక్కడ ఉంటున్న ఒక మహిళ సొసైటీ కాంప్లెక్స్‌లోంచి కారులో బయటకు వెళ్లాలనుకుంది. అయితే, దూరంగా ఉన్న గార్డు వచ్చి మెయిన్ గేటు తీసేసరికి కాస్త ఆలస్యమైంది. అంతే.. కోపం తెచ్చుకున్న ఆ మహిళ, సెక్యూరిటీ గార్డుపై రెచ్చిపోయింది. అసభ్య పదజాలం వాడుతూ నోటికొచ్చినట్లు తిట్టింది. కాలర్ పట్టుకుని లాక్కెళ్లి దాడి చేసింది. ఆ గార్దు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నా వినిపించుకోలేదు. పక్కన ఉన్న ఇతర గార్డులను కూడా తిట్టింది. పైగా మహిళలకు మర్యాద ఇవ్వడం నేర్చుకోండంటూ క్లాస్ పీకింది. గార్డును దారుణంగా అవమానించడంతో విసిగిపోయిన అతడు.. ఈ ఉద్యోగం చేయడం తన వల్ల కాదంటూ ఐడీ కార్డు కూడా విసిరేశాడు. ఈ ఘటనను అక్కడున్న వారెవరో వీడియో తీశారు.

iPhone: ఐఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే కొద్ది రోజులు ఆగండి.. ఎందుకంటే..

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు మహిళ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనుచితంగా ప్రవర్తించిన ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ స్పందించారు. మహిళపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు.