సింహాలు చుట్టుముట్టిన అంబులెన్స్‌‌లోనే మహిళ ప్రసవం

  • Published By: Subhan ,Published On : May 21, 2020 / 12:41 PM IST
సింహాలు చుట్టుముట్టిన అంబులెన్స్‌‌లోనే మహిళ ప్రసవం

గుజరాత్ లో ఓ అరుదైన ఘటన జరిగింది. పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళ అంబులెన్స్‌లో ఉండగా సింహాలు చుట్టుముట్టాయి. మహిళ పురిటినొప్పులతో బాధపడుతుండటంతో అంబులెన్స్ ఇంటికి వచ్చింది. హాస్పిటల్ కు తీసుకెళుతుండగా మార్గం మధ్యలో సింహాలు చుట్టుముట్టాయి. 

హాస్పిటల్ కు వెళ్లేందుకు వేరే దారి లేకపోవడంతో అంబులెన్స్ అక్కడే ఆపేశారు. మహిళ ప్రసవానికి అక్కడే ఏర్పాట్లు చేశారు. అత్యవసర సిబ్బందే పురుడు పోసి డెలివరీని నిర్వహించారు. తల్లీ బిడ్డా క్షేమంగానే ఉన్నారని సిబ్బంది చెప్పారు. సింహాలు వాహనాన్ని దాదాపు 20 నిమిషాల వరకూ కదలకుండా చేశాయి. 

ఆ తర్వాత వారిద్దరినీ అంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకెళ్లారు.