Gang Rape : దారుణం… భర్త కళ్ల ముందే భార్యపై గ్యాంగ్ రేప్, వీడియో తీసి..

దిశ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా.. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మృగాళ్లలో మార్పు రావడం లేదు. కామాంధులు రెచ్చిపోతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు తెగబడుతున్నారు. పశువుల్లా మీద పడి కామ కోరికలు తీర్చుకుంటున్నారు. నేరాలకు కేరాఫ్ గా చెప్పుకునే ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం జరిగింది.

Gang Rape : దారుణం… భర్త కళ్ల ముందే భార్యపై గ్యాంగ్ రేప్, వీడియో తీసి..

Woman Gang Raped

Woman Gang Raped : నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా.. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మృగాళ్లలో మార్పు రావడం లేదు. కామాంధులు రెచ్చిపోతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు తెగబడుతున్నారు. పశువుల్లా మీద పడి కామ కోరికలు తీర్చుకుంటున్నారు. నేరాలకు కేరాఫ్ గా చెప్పుకునే ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం జరిగింది.

భర్త కళ్ల ముందే భార్యపై గ్యాంగ్ రేప్ జరిగింది. ముగ్గురు కామాంధులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అంతేకాదు ఈ వికృతచేష్టను తమ మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీశారు. ఆ తర్వాత దంపతుల దగ్గరున్న డబ్బు, బంగారం దోచుకుని పారిపోయారు. ఆగ్రా జిల్లాలో ఈ ఘోరం జరిగింది.

సోమవారం(మార్చి 29,2021) సాయంత్రం 6 గంటలకు ఎట్మౌడౌలా ప్రాంతంలోని తన తల్లిదండ్రుల ఇంటికి భర్తతో కలిసి బైక్ పై వెళ్తుండగా.. మార్గమధ్యలో ముగ్గురు వ్యక్తులు వారి బైక్‌ను అడ్డగించారు. దంపతులపై దాడి చేసి వారిని బలవంతంగా సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి
తీసుకెళ్లారు. అక్కడ భర్తను కట్టేశారు. ఆ తర్వాత అతడి కళ్ల ముందే భార్యపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఈ చర్యను తమ మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించారు. అనంతరం వారి దగ్గరున్న రూ.10వేల నగదు, మహిళ చెవి రింగులు, ఇతర వస్తువులు తీసుకొని పారిపోయారు. కళ్ల ముందే దారుణం జరుగుతున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాస్థితిలో ఆ భర్త ఉండిపోయాడు.

“నేను నా భర్త కలిసి మా అమ్మ వాళ్లింటికి వెళ్తుండగా ముగ్గురు బెక్​పై వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారు. నా ఒంటిపై ఉన్న దుస్తులు తొలగించాలని బలవంతం చేశారు. దీనికి నిరాకరించగా… నన్న, నా భర్తను తీవ్రంగా కొట్టారు. తర్వాత అత్యాచారం చేశారు. దాన్ని వీడియో తీసి బెదిరించి రూ.10వేల నగదుతో పాటు నా ఒంటిపై ఉన్న బంగారం ఎత్తుకెళ్లారు” అని బాధితురాలు తెలిపింది.

జరిగిన దారుణంపై బాధితులు మంగళవారం(మార్చి 30,2021) పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్నారు.
నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. కాగా, బాధితురాలికి ఇటీవలే పెళ్లయ్యింది. భర్త ముందే భార్య గ్యాంగ్ రేప్ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.