Brave Woman: డ్రైవింగ్ లో మూర్చపోయిన బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించిన మహిళ

కదులుతున్న బస్సులో డ్రైవర్.. మూర్చిల్లిపోగా ఒక మహిళ తన అసాధారణ ప్రతిభతో చాకచక్యంగా వ్యవహరించి తనతో సహా 23 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడింది.

Brave Woman: డ్రైవింగ్ లో మూర్చపోయిన బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించిన మహిళ

Veeranari

Brave Woman: కదులుతున్న బస్సులో డ్రైవర్.. మూర్చపోగా ఒక మహిళ తన అసాధారణ ప్రతిభతో చాకచక్యంగా వ్యవహరించి తనతో సహా 23 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడింది. జనవరి 13న మహారాష్ట్రలోని మొరాచి చించోలీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యోగితా ధర్మేంద్ర సతవ్ అనే మహిళ జనవరి 13న మరో 23 మంది మహిళలతో కలిసి పూణే సమీపంలోని మొరాచి చించోలీ ప్రాంతంలో విహారయాత్రకు వెళ్ళింది. వీరంతా బస్సులో రెండు రోజుల పాటు వివిధ ప్రాంతాలు చుట్టివచ్చారు.

Also read: Aparna Yadav: యూపీలో ఎలక్షన్ హీట్.. బీజేపీలోకి ములాయం సింగ్ కోడలు?

విహార యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణమయిన సమయంలో బస్సులో ప్రయాణిస్తుండగా..బస్సు డ్రైవర్ ఒక్కసారిగా మూర్చిల్లిపోయాడు. ఇది గమనించిన టూర్ నిర్వాహకురాలు ఆశా వాఘమారే..ప్రయాణికులను అప్రమత్తం చేసింది. బస్సు డ్రైవర్ పరిస్థితిని గమనించిన యోగితా.. చాకచక్యంగా వ్యవహరించి బస్సు స్టీరింగ్ అందుకుంది. ఎంతో జాగ్రత్తగా 10 కిలోమీటర్ల దూరం బస్సు నడిపిన యోగితా..తనతో పాటు తోటి ప్రయాణికులను రక్షించింది. యోగితా బస్సు నడుపుతున్న సమయంలోనే డ్రైవర్ మరోసారి మూర్చిల్లిపోయాడు. దీంతో అతన్ని సమీప గ్రామంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Also read: Virat Kohli : టెస్ట్ కెప్టెన్సీకి గుడ్‌బై : కోహ్లీ

అత్యవసర సమయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి 23 మంది ప్రయాణికులను కాపాడిన యోగితా ధర్మేంద్ర సతవ్ ను అందరూ ప్రశంసించారు. యోగితా తన స్వగ్రామం వాఘోలీ చేరుకున్న అనంతరం విషయం తెలుసుకున్న గ్రామ మాజీ మహిళా సర్పంచ్..జయశ్రీ యోగితాను అభినందించారు. కాగా కారు నడిపిన అనుభవంతో యోగితా ఈ సాహసాన్ని ప్రదర్శించడం కొసమెరుపు.

Also read: Rajadhani Train: భారీ సిమెంట్ పిల్లర్ ను ఢీకొట్టిన రాజధాని ఎక్స్‌ప్రెస్