Vaccination : మహిళకు ఒకే రోజు మూడు డోసుల వ్యాక్సిన్‌

ఓ మహిళకు ఒకే రోజు మూడు డోస్ ల వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకున్న మహిళ ఆరోగ్యపరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఘటనపై విచారణ చేపట్టారు అధికారులు

Vaccination : మహిళకు ఒకే రోజు మూడు డోసుల వ్యాక్సిన్‌

Vaccination (3)

Vaccination : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. మరోవైపు కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. 100 రోజుల తర్వాత కరోనా కేసుల సంఖ్య 40 వేలకు దిగువన నమోదైంది. ఇక దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వ్యాక్సిన్లను పంపిణి చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి దేశంలోని 32.8 కోట్లమందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. 5.5 కోట్ల మందికి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తైంది.

అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో పలు చోట్ల పొరపాట్లు జరుగుతున్నాయి. మొదటి డోస్, రెండవ డోస్ టీకా మార్చి వేయడం.. వ్యాక్సిన్ ఫీల్ చేయకుండానే ఖాళీ సిరంజి ఇంజెక్ట్ చేయడం.. ఒక సారి రెండు డోస్ లు ఇవ్వడం వంటి పొరపాట్లు తరచుగా జరుగుతున్నాయి. ఇక తాజాగా జరిగిన తప్పిదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళకు గంటల వ్యవధిలో మూడు డోస్ ల వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

థానే మున్సిపాల్ కార్పొరేషన్ లో పనిచేసే మహిళకు గంటల వ్యవధిలో మూడు డోస్ ల వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ విషయం ఆమె భర్తకు చెప్పడంతో సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆమె భర్త మాట్లాడుతూ తన భార్య తొలిసారి వ్యాక్సిన్ వేసుకుంటున్నందున ఆమెకు వ్యాక్సిన్ ప్రక్రియ గురించి అవగాహన లేదన్నారు.

సిబ్బంది గంటల వ్యవధిలో మూడు డోస్ లు ఇవ్వడంతో ఆమెకు జ్వరం వచ్చినట్లు తెలిపాడు. మరుసటి రోజు ఉదయం తగ్గిందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వివరించాడు. ఇక ఈ సమస్యను స్థానిక కార్పొరేటర్‌ వద్ద లేవనెత్తగా ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.