Wrestlers detained: రెజ్లర్ల అరెస్టుపై వెల్లువెత్తిన వ్యతిరేకత.. నెట్టింట్లో విమర్శల వెల్లువ

సాక్షి మాలిక్ సహా మరికొంత మంది రెజ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, రెజ్లర్లను అరెస్ట్ చేసిన తీరు, వారితో పోలీసులు వ్యవహరించిన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఛాంపియన్లను ప్రభుత్వం అవమానిస్తోందని, ఇబ్బందులకు గురి చేస్తోందంటూ మండిపడుతున్నారు.

Wrestlers detained: రెజ్లర్ల అరెస్టుపై వెల్లువెత్తిన వ్యతిరేకత.. నెట్టింట్లో విమర్శల వెల్లువ

Jantar Mantar: రెజ్లర్లకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనలో ఉన్న ఆందోళనకారులపై పోలీసులు అణచివేతకు దిగారు. జంతర్ మంతర్ వద్ద ఉన్న టెంట్లను తొలగించారు. పలువురు రెజ్లర్లను అరెస్ట్ చేశారు. ఒకవైపు భారత నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతుండగా.. మరొకవైపు కూతవేటు దూరంలో రెజ్లర్లకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

Pakistan Avalanche : పాకిస్థాన్ లో తీవ్ర విషాదం.. హిమపాతం విరుచుకుపడి 10 మంది మృతి

దేశ రాజధానిలో కొద్ది రోజులుగా నిరసన చేస్తున్న రెజ్లర్లకు మద్దతుగా వివిధ రాష్ట్రాల ఖాప్ పంచాయతీలు, రైతులు ఆదివారం పార్లమెంటు భవనం సమీపంలో ‘మహిళా సమ్మాన్ మహాపంచాయత్’కు పిలుపునిచ్చారు. నూతన పార్లమెంట్ భవనం వైపు రెజ్లర్లు ర్యాలీ చేపట్టారు. అయితే అటువైపు వెళ్లకుండా పోలీసులు భారికెడ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ రెజ్లర్లు వాటిని తొలగించుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలోనే పోలీసులకు రెజ్లర్లకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ సహా మరికొంత మంది రెజ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, రెజ్లర్లను అరెస్ట్ చేసిన తీరు, వారితో పోలీసులు వ్యవహరించిన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఛాంపియన్లను ప్రభుత్వం అవమానిస్తోందని, ఇబ్బందులకు గురి చేస్తోందంటూ మండిపడుతున్నారు. ఢిల్లీ వుమెన్ కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ స్పందిస్తూ ‘‘విదేశీ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఈ కూతుళ్లను నేడు ఇలా ఈడ్చుకెళ్లి త్రివర్ణ పతాకాన్ని నడిరోడ్డుపై ఇలా అవమానిస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు.

కాగా, ఈ విషయమై బజరంగ్ పునియా స్పందిస్తూ ‘‘మేం శాంతిపూర్వకంగా నిరసన తెలియజేస్తున్నాం. మావారిని అందరినీ నిర్భంధించారు. ప్రభుత్వం, ప్రజాస్వామ్యం అంటే మాకు గౌరవం ఉంది. అందుకే మాకు న్యాయ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పోలీసులతో మాకు ఎలాంటి తగాదాలు లేవు. నిర్భంధించిన వారిని విడుదల చేయాలని పోలీసుల్ని కోరుతున్నాం’’ అని అన్నారు. అయితే ఢిల్లీ స్పెషల్ సీపీ దేవేంద్ర పాఠక్ స్పందిస్తూ ‘‘క్రీడాకారులంటే మాక్కూడా గౌరవమే. కానీ నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ఇబ్బంది కలగకూడదు’’ అని అన్నారు. కాగా, ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ బార్డర్, సింగూ బార్డర్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.