వాహనాలపై ఇష్టమొచ్చిన రాతలు రాసుకుంటే జేబులు ఖాళీయే..

వాహనాలపై ఇష్టమొచ్చిన రాతలు రాసుకుంటే జేబులు ఖాళీయే..

writing caste sensitive words on vehicles challan : రోడ్డుమీద వెళుతుంటే చాలా వాహనాలపై కొన్ని రాతలు రాసి ఉండటాన్ని మీరెప్పుడన్నా గమనించారా? కొంతమంది వారి వారి కులా పేర్లు రాసుకుంటారు. మరికొందరు వారి గ్రామాల పేర్లు లేక పార్టీ పేర్లు రాసుకుంటారు. కానీ ఇకనుంచి అటువంటి రాతలు ఉంటే జేబులు ఖాళీ అవ్వక తప్పదంటున్నారు అధికారులు. అంతేకాదు మీ వాహనాన్ని సీజ్ కూడా చేస్తామంటున్నారు. వాహనాలపై ఇష్టమొచ్చిన పేర్లు రాయొద్దనీ లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

కులాల పేర్లు వెహికల్స్ మీద రాస్తే మాత్రం ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. ఉత్తర ప్రదేశ్‌లో ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఈ విషయంపై హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వాహనాలపై కులం పేరు రాస్తే శిక్షార్హమని తెలిపారు. కొత్త మోటార్ వెహికల్ చట్టం ప్రకారం వెహికల్‌పై కులం పేరు రాస్తే జరిమానా వేస్తామన్నారు.

ఉత్తర ప్రదేశ్‌‌లో ఇలా క్యాస్ట్ పేరు రాసినా..వెహికల్ నెంబర్ ప్లేట్‌పై ఏమైనా రాతలు (అమ్మా నాన్నల దీవెన అంటూ కొంతమంది రాస్తుంటారు) రాస్తే అప్పుడు కూడా జరిమానా తప్పదంటున్నారు. అంతేకాదు..కులం పేరు రాస్తే జరిమానా మాత్రమే కాదు వెహికల్‌ను సీజ్ కూడా చేసేస్తారని గమనించాల్సిన విషయం. అలా రాసి ఉన్న వాహనాన్ని సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు కూడా ఉంది.

అందువల్ల మీరు మీ వెహికల్‌పై ఏమైనా ఇలాంటి రాతలు రాసి ఉంటే వెంటనే వాటికి చెరిపేయండి. లేదంటే పోలీసుల చేతికి చిక్కితే మాత్రం జరిమానాతోపాటు వెహికల్‌ కూడా సీజ్ అయిపోతుంది. ఆ తరువాత లబోదిబోమన్నా అధికారులు వదలరు. కాబట్టీ..ఇకనుంచి వెహికల్‌స్ పై ఎటువంటి రాతలు రాసుకోకుండా ఉంటే మంచిది..ఉత్తరప్రదేశ్ పోలీసులు గత ఏడాది డిసెంబర్‌లో ఈ ఆపరేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

కాగా హర్యానాలో ప్రతి 20వ వాహనానికి కులం పేరు రాసి ఉంటుందని స్వయంగా పోలీసులే తెలిపారు. వీటిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు అలాంటి వాహనాలపై చర్యలు ప్రారంభించారు.

దీనిపై ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ..మొదట హెచ్చరిక చేసి వదిలేస్తామని కానీ మరోసారి కూడా అదే రిపీట్ అయితే జరిమానా తప్పదని తెలిపారు. చాలామంది హెచ్చరించినా వినరు. కనీసం ట్రాఫిక్ నియమాలను పాటించరు. అటువంటి వాహన యజమానులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.