PM Modi : కోవిడ్ వేళ ఆశాకిరణం “యోగా”

ఇవాళ(జూన్-21,2021)7వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

PM Modi : కోవిడ్ వేళ ఆశాకిరణం “యోగా”

Pm Modi (1)

PM Modi ఇవాళ(జూన్-21,2021)7వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కరోనా నేపథ్యంలో టీవీ ప్రసంగం ద్వారా దేశ ప్రజలకు మోదీ సందేశమిచ్చారు. కరోనా నుంచి పోరాడేందుకు ప్రతి ఒక్కరూ యోగాను సురక్షా కవచంగా మార్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రతి దేశం, ప్రతి దేశం,ప్రతి సమాజం యోగా ద్వారా స్వస్థత పొందుతుందని చెప్పారు.వ్యక్తిగత క్రమశిక్షణలో కూడా యోగా సాయపడుతుందన్నారు. కోవిడ్ ఉద్భవించినప్పుడు ఏ దేశం కూడా సిద్దంగా లేదని..ఆ సమయంలో ప్రజల్లో యోగా అనేది ఒక అంతర్గత బలంగా మారిందని మోదీ అన్నారు. తాము వైరస్ తో పోరాడగలము అనే నమ్మకాన్ని యోగా కలిగించిందన్నారు. వైరస్ పై పోరాటానికి యోగాని ఓ టూల్ గా చేసుకున్నట్లు ఫ్రంట్ లైన్ వారియర్లు తనతో చెప్పారని మోదీ తెలిపారు.

ఒత్తిడి నుంచి బలం వైపుకి మరియు నెగిటివిటీ నుంచి పాజిటివిటీ వైపుకి ఓ మార్గాన్ని యోగా మనకు చూపిందని మోదీ తెలిపారు. కోవిడ్ సమయంలో యోగాపై ప్రజల ఆశక్తి పెరిగిందన్నారు. యోగాపై ప్రేమ పెరిగిందన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలకు యోగా డే అనేది తమ పాత సాంస్కృతిక ఫెసివల్ కాదన్నారు. ఈ కోవిడ్ కష్టసమయంలో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని..యోగా వల్ల వారు దీనిని మర్చిపోగలరని అన్నారు. యోగా వల్ల మన శరీరానికి మరియు ఇమ్యూనిటీకి కలిగే లాభాలు గురించి ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు.

చిన్నారులు కోవిడ్ పై పోరాడేందుకు కూడా యోగా సాయపడుతుందన్నారు. యోగా ద్వారా మంచి ఆరోగ్యం సమకూరుతుందని, దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని మోదీ చెప్పారు. శారీరక, మానసిక దృఢత్వాన్ని యోగా పెంపొందిస్తుందని, అంతర చైతన్యం పెంపొందుతుందని వెల్లడించారు. ముందస్తు రక్షణ కవచంగా యోగా ఉపయోగపడుతుందని చెప్పారు. యోగా ఫర్ వెల్ నెస్(ఆరోగ్యం కోసం యోగా)అనే థీమ్ తో ఈ ఏడాది యోగా డేని నిర్వహించుకుంటున్నట్లు మోదీ తెలిపారు. శారీర‌క, మానసిక ఆరోగ్యం కోసం యోగా సాధ‌న చేయాల‌నేది ఈ నినాదం ఉద్దేశమని ప్రధాని తెలిపారు.

కాగా, 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ..యోగాని విశ్వవ్యాప్తం చేసేందుకు గురుతర బాధ్యతను భుజానికెత్తుకొని 2014 డిసెంబర్ లో ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించారు. భారత్ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు తెలిపాయి. సంవత్సరంలోని 365 రోజుల్లో అత్యంత ఎక్కువ పగటి సమయం ఉండే జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని యూఎస్ తీర్మానించింది. 2015 లో మొదటి ఇంటర్నేషనల్ యోగా డే జరపుకోగా..ఇప్పుడు ఏడవ యోగా డే ని జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా యోగా డేను సెలబ్రేట్ చేస్తున్నారు. యోగా కార్యక్రమాల్లో అన్ని దేశాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.