CM Mamata Banerjee-PM Modi : రెస్ట్ తీసుకోమన్న దీదీ .. చలించిపోయిన మోదీ

ప్రధాని మోడీ తన తల్లి చనిపోయినా ఓ పక్క కొడుకుగా బాధ్యతలు నిర్వహించి మరోపక్క దేశ ప్రధానిగా ముందుగానే ఖరారు అయిన అధికారిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. తల్లి అంతిమయాత్రలో కొడుకు పాడె మోయటమేకాదు అంత్యక్రియల్లో తన బాధ్యతను నిర్వర్తించారు.అనంతరమే తల్లిని కోల్పోయిన దు:ఖాన్ని గుండెల్లోనే అదుముకుని అధికారిక కార్యక్రమానికి హాజరయ్యారు. కోల్ కతా నుంచి వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు పచ్చ జెండా ఊపారు వర్చువల్ గా. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ రెస్ట్ తీసుకోండి అంటూ అన్న మాటలకు ప్రధాని మోడీ చలించిపోయారు.

CM Mamata Banerjee-PM Modi : రెస్ట్ తీసుకోమన్న దీదీ .. చలించిపోయిన మోదీ

CM Mamata Banerjee-PM Modi

Mamata Banerjee-PM Modi : ప్రధాని మోడీ తన తల్లి చనిపోయినా ఓ పక్క కొడుకుగా బాధ్యతలు నిర్వహించి మరోపక్క దేశ ప్రధానిగా ముందుగానే ఖరారు అయిన అధికారిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. తల్లి అంతిమయాత్రలో కొడుకు పాడె మోయటమేకాదు అంత్యక్రియల్లో తన బాధ్యతను నిర్వర్తించారు.అనంతరమే తల్లిని కోల్పోయిన దు:ఖాన్ని గుండెల్లోనే అదుముకుని అధికారిక కార్యక్రమానికి హాజరయ్యారు. కోల్ కతా నుంచి వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు పచ్చ జెండా ఊపారు వర్చువల్ గా.

తల్లిని కోల్పోయిన దు:ఖంలో కూడా మోదీ కార్యక్రమానికి రావటంతో పశ్చిబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ‘‘పశ్చిమబెంగాల్ ప్రజల తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు. ఈరోజు మీకు ఎంతో విషాదకరమైన రోజు. మీ అమ్మ మాకు కూడా అమ్మే. మీ సేవలు కొనసాగించేందుకు వీలుగా భగవంతుడు మీకు బలాన్ని ఇవ్వాలి. దయచేసి కొంత విశ్రాంతి తీసుకోండి’ అని దీదీ అన్నారు. మీ తల్లి మాకు కూడా తల్లివంటివారేనని అన్నారు దీదీ. మీ అమ్మ మాకు కూడా అమ్మేనని కొడుకుగా మీ బాధ్యతనలు నిర్వర్తించటమేకాకుండా ప్రధానిగా కూడా మీ పనిని అధికారికంగా నిర్వర్తించి అమ్మ పట్ల గౌరవం చాటుతున్నారని దయచేసి కొంత విశ్రాంతి తీసుకోండి అన్నారు దీదీ. మమతా బెనర్జీ మాటలకు ప్రధాని మోడీ చలించిపోయారు. మమతా బెనర్జీ మాట్లాడిన మాటలు ప్రధానిని కదిలించాయి.
PM Modi’s Mother Passed Away : ప్రధాని మోదీకి మాతృ వియోగం.. అనారోగ్యంతో హీరాబెన్ కన్నుమూత

CM Didi-PM Modi : దీదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మోదీ

కాగా పశ్చిమ బెంగాల్ లోని హౌరా నుంచి న్యూ జల్పాయిగురి మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ కూడా హాజరయ్యారు. కాగా బీజేపీ ప్రభుత్వంపైనా ప్రధాని మోడీపైన ఎప్పుడూ విమర్శలతో విరుచుకుపడే సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీ తల్లి చనిపోయిన రోజునే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభోత్సవానికి రావటంతో ఆమె కూడా ఓ అమ్మలా వ్యవహరించారు. ప్రదాని మోడీకి తన సంతాపాన్ని తెలిపారు. మీ అమ్మ మాకు అమ్మవంటిదేనని రాజకీయాలను పక్కన పెట్టి మాట్లాడారు.అదే మని అమ్మ అంటే..అమ్మ మరణం కూడా రాజకీయ శతృవుల మధ్య కూడా ఎంతటి ప్రేమను పుట్టిస్తోందో ఈ సందర్భంగా తెలిసింది అని చెప్పుకోవచ్చు. అదే మరి అమ్మ అంటే..

PM Modi mother Carries Mortal Remains : తల్లి పాడె మోసిన ప్రధాని మోడీ .. హీరాబెన్ అంత్యక్రియలు పూర్తి