ChatGPT-powered Bing: ఇక తదుపరి తర ఛాట్ జీపీటీ?.. కీలక ప్రకటన చేయనున్న మైక్రోసాఫ్ట్

ఛాట్ జీపీటీకి దీటుగా అదే తరహాలో సొంతంగా 'బార్డ్' పేరుతో సేవలను ప్రవేశపెడుతున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించిన కొన్ని నిమిషాలకే మైక్రోసాఫ్ట్ కూడా 'ఓపెన్ ఏఐ' సంస్థతో కలిసి ఇదే తరహా ప్రకటన చేయడానికి సిద్ధమైంది. మైక్రోసాఫ్ట్ అమెరికాలోని తమ ప్రధాన కార్యాలయంలో ఇవాళ ''ఓపెన్ ఏఐ''తో కలిసి ''ఛాట్ జీపీటీ'' ఆధారిత తదుపరి తర సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

ChatGPT-powered Bing: ఇక తదుపరి తర ఛాట్ జీపీటీ?.. కీలక ప్రకటన చేయనున్న మైక్రోసాఫ్ట్

ChatGPT-powered Bing

ChatGPT-powered Bing: ఇంటర్నెట్, కృత్రిమ మేధ గురించి ప్రాథమిక అంశాలు తెలిసిన వారందరి దృష్టీ ఇప్పుడు ఛాట్ జీపీటీ (ChatGPT) పైనే ఉంది. ఇదో చాట్‌ బోట్.. దీన్ని ఓపెన్ ఏఐ సంస్థ అభివృద్ధి చేసింది. మనం ఏదైనా ప్రశ్న అడిగితే వెంటనే సమాధానం ఇస్తుంది. ఒక అంశాన్ని గురించి అత్యంత వేగంగా విశ్లేషించే సామర్థ్యం దీనికి ఉంది.

మనుషులు మాత్రమే కవితలు రాయగలరని చెప్పుకునే అవకాశమూ లేకుండా చేసింది. ఎందుకంటే ఛాట్ జీపీటీ కూడా కవితలు రాస్తుంది. మనం ఏదైనా టాపిక్ పై కవిత రాయమంటే వెంటనే రాసి మన ముందు ఉంచుతుంది. కంటెంట్ ను కూడా రాసి పెడుతుంది. అంతేకాదు, మీరు ఏదైనా వ్యక్తిగత సమస్యతో బాధపడుతుంటే సలహాలు ఇచ్చే వారు లేరని చింతించే అవసరమూ ఉండదు.

మీకు చక్కని సలహాలు ఇస్తుంది ఛాట్ జీపీటీ. ఇదో అతి గొప్ప ఆవిష్కరణ అని చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు ఈ తరహా సేవలపైనే దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఛాట్ జీపీటీకి దీటుగా అదే తరహాలో సొంతంగా ‘బార్డ్’ పేరుతో సేవలను ప్రవేశపెడుతున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించిన కొన్ని నిమిషాలకే మైక్రోసాఫ్ట్ కూడా ‘ఓపెన్ ఏఐ’ సంస్థతో కలిసి ఇదే తరహా ప్రకటన చేయడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 8న బార్డ్ ను ప్రవేశపెడుతున్నామని ఇప్పటికే గూగుల్ ప్రకటించింది.

బార్డ్ కు సంబంధించిన అన్ని వివరాలూ రేపు తెలిపే అవకాశం ఉంది. ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ కూడా అమెరికాలోని తమ ప్రధాన కార్యాలయంలో ఇవాళ ఓపెన్ ఏఐతో కలిసి ఛాట్ జీపీటీ ఆధారిత తదుపరి తర సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. చాట్ జీపీటీ అనుసంధానంతో మైక్రోసాఫ్ట్-ఓపెన్ ఏఐ ప్రవేశపెట్టనున్న సేవలను సంబంధించిన ఫీచర్లను మైక్రోసాఫ్ట్ పరిచయం చేయనున్నట్లు సమాచారం.

దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల స్పందిస్తూ.. ”కొన్ని ప్రాజెక్టులపై సాధించిన అభివృద్ధిని మీతో పంచుకుంటాను” అని మీడియాకు తెలిపారు. దీంతో మైక్రోసాఫ్ట్-ఓపెన్ ఏఐ సంస్థలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్ బింగ్ ను అప్ డేట్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే, ఓపెన్ ఏఐ తదుపరి తర ఛాట్ జీపీటీని ప్రవేశపెట్టే అవకాశాలూ ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇది బింగ్ లోనే లభ్యమవుతుందని వార్తలు వస్తున్నాయి.

Turkey Earthquake : 100 సార్లకుపైగా కంపించిన భూమి, టర్కీలో ఆగని భూప్రకంపనలు