2,000 Rupees Note : ఇదేందిరా బాబూ..రూ. 2 వేలు నోటు ఇచ్చాడని బైక్‌లో పోసిన పెట్రోల్ తిరిగి తీసేసుకున్న బంక్ సిబ్బంది

పెద్ద నోట్ల రద్దు సమయంలో ఎన్నో వింత వింత విన్యాసాలు చూశాం..తాజాగా రెండు వేల నోట్ రద్దు ప్రకటనతో మరిన్ని వింత వింత ఘటనలు చూడాల్సివస్తోంది.రెండు వేల నోటా? బాబోయ్ మాకొద్దు అంటున్నారు వ్యాపారులు..ఓ పెట్రోల్ బంకులో జరిగిన ఘటన చూస్తే ఏంటింది? రూ.రెండు వేల నోటా? లేదా భూతమా? అనేలా ఉంది.

2,000 Rupees Note : ఇదేందిరా బాబూ..రూ. 2 వేలు నోటు ఇచ్చాడని బైక్‌లో పోసిన పెట్రోల్ తిరిగి తీసేసుకున్న బంక్ సిబ్బంది

two thousand Note

2,000 Rupees Note : పెద్ద నోట్ల రద్దు అయినప్పుడు దేశంలో బడాబాబులు తప్ప సామాన్యులంతా నడి రోడ్డుపై నిలబడ్డారు. రూ.రెండు వేలు కోసం బ్యాంకుల్లో తిండీ తిప్పలు మాని పడిగాపులు కాశారు. ఇప్పుడు రెండు వేల నోటు రద్దుతో జనాలు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. రెండు వేల నోటు ఇస్తే ఏ వ్యాపారి తీసుకోవటంలేదు. ఆఖరికి పెట్రోల్ బంక్ వారు కూడా తీసుకోవటంలేదు. అదేదో భూతాన్ని చూసినట్లుగా భయపడుతున్నారు. దాన్ని వదిలించుకోవటానికి లేనిపోను పాట్లు ఎందుకు అనుకుంటున్నారు.

బంక్ లో పెట్రోల్ కొట్టించుకుని ఓ వ్యక్తి రెండు వేల నోటు ఇస్తే బంక్ సిబ్బంది ఏం చేసారో తెలిస్తే వార్నీ మరీ ఇంత దారుణమా? రెండు వేల నోటు అంటే ఇంతగా భయపడాలా? అనేలా ఉంది. రూ. 2 వేల నోటు సెప్టెంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు చ‌లామ‌ణిలో ఉంటుంద‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ప‌ష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో చాలామంది రెండు వేల నోట్లు పట్టుకుని బ్యాంకులకు వెళుతున్నారు.

ఇటువంటి సమయంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని జ‌లౌన్ జిల్లాలో ఓ ఆసక్తికర ఘ‌ట‌న వెలుగు చూసింది. ఓ ద్విచక్ర వాహన దారుడు పెట్రోల్ బంక్‌కు వెళ్లి.. త‌న యాక్టివాలో పెట్రోల్ పోయించుకున్నాడు. ఆ త‌ర్వాత బంక్ సిబ్బందికి రూ. 2 వేల నోటు ఇచ్చాడు. అంతే వాళ్లు బాబోయ్ మాకు ఈ నోటు వద్దు వేరేది ఇవ్వమన్నారు. దానికి నావద్ద వేరే నోటు లేదన్నాడు. దాంతో బంక్ సిబ్బంది లేకపోతే ఏం మా పెట్రోల్ మేం తీసేసుకుంటాం అంటూ యాక్టివాలో నింపిన పెట్రోల్‌ను పైపు స‌హాయంతో బ‌య‌ట‌కు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఈ రెండువేల నోటు రద్దు సమయంలో తెగ వైరల్ అవుతోంది. ఇటువంటి ఘటనలు ఒక్క ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనే కాదు. పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. రూ. 2 వేల నోటును స్వీక‌రించ‌బోమ‌ని బోర్డులు కూడా పెట్టేశాయి.