Karnataka ADR report: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై 13 క్రిమినల్ కేసులు, డీకేపై 19 క్రిమినల్ కేసులు
ఇందులో ఆరుగురు మంత్రులు 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మాత్రమే పేర్కొన్నారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో మొత్తం 34 మంత్రులు ఉన్నారు. ఇందులో సుమారు సగం మందిపై క్రిమినల్ కేసులు ఉండడం గమానర్హం. మంత్రుల్లో బి.నాగేంద్రపై అత్యధికంగా 42 క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్ ద్వారా తెలిసింది.

CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై 13 క్రిమినల్ కేసులు ఉన్నాయట. కొద్ది రోజుల క్రితం ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో ఆయనే స్వయంగా పేర్కొన్నారు. ఇక ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా మొత్త 16 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. డీకే శివకుమార్‌పై 19 క్రిమినల్ కేసులతోపాటు సీబీఐ, ఈడీ కేసులున్నాయి. ఇక మంత్రుల్లో బి.నాగేంద్రపై అత్యధికంగా 42 క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్ ద్వారా తెలిసింది.
Delhi Highcourt: రూ.2,000 నోట్ల మార్పిడికి ఐడి ప్రూఫ్ తప్పనిసరిపై కీలక తీర్పిచ్చిన ఢిల్లీ హైకోర్టు
ఇతర మంత్రులు.. ప్రియాంక ఖర్గేపై 9, ఈశ్వర్ ఖండ్రేపై 7, ఎం.బి.పాటిల్‌పై 5, రామలింగారెడ్డిపై 4, జి.పరమేశ్వరపై 3, హెచ్‌కే పాటిల్, డి.సుధాకర్, సతీష్ జార్కిహొళిపై తలా 2 కేసులు, ఎన్.చెలువరాయస్వామి, కేహెచ్ మునియప్ప, ఎస్‌ఎస్ మల్లికార్జునపై ఒక్కో కేసు ఉన్నాయట. మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్‌పై 6 సీరియస్ కేసులుండగా, వీటిలో హత్యకేసూ ఉండటం గమనార్హం. కాగా, ఇందులో ఆరుగురు మంత్రులు 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మాత్రమే పేర్కొన్నారు.
Census: ఎన్నికలు ముగిసే వరకు జనగణన లేనట్టే.. ప్రజలకు కొత్తగా 31 ప్రశ్నలు
సిద్ధరామయ్య మంత్రివర్గంలో మొత్తం 34 మంత్రులు ఉన్నారు. ఇందులో సుమారు సగం మందిపై క్రిమినల్ కేసులు ఉండడం గమానర్హం. ఇక రాష్ట్రంలో మంత్రులకు తాజాగా శాఖలు కేటాయించారు. ఆర్థికశాఖను తనవద్దే ఉంచుకున్న సిద్ధరామయ్య.. డీకే శివకుమార్‌కు ప్రధాన, మధ్యస్థ నీటిపారుదల శాఖ, బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖలను కేటాయించారు. కీలకమైన హోంశాఖను జి. పరమేశ్వర్‌కు కేటాయించారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను దినేష్ గుండూరావుకు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖను ప్రియాంక్ ఖర్గేకు కేటాయించారు. వ్యవసాయశాఖను ఎన్. చెలువర్య స్వామికి కేటాయించారు. ఎక్సైజ్ శాఖను తిమ్మాపూర్ రామప్ప బాలప్పకు కేటాయించారు. సిద్ధరామయ్య కేబినెట్‌లో ఏకైక మహిళా మంత్రి లక్ష్మీ ఆర్ హెబ్బాల్కర్ కు స్త్రీ, శిశు సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల సాధికారత శాఖలను కేటాయించారు.