Akhilesh Yadav: పార్టీ మీటింగ్ అయిపోగానే కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డ అఖిలేష్ యాదవ్

"పార్లమెంటరీ ఎన్నికలకు సన్నాహాలు మొదలవుతున్నాయి. కాబట్టి దాడులు పెరగొచ్చు. కానీ ఇది కాషాయ పార్టీకి సహాయం చేయదు” అని అన్నారు. రెండు రోజుల జాతీయ కార్యవర్గంలో ఆమోదించిన రాజకీయ తీర్మానం గురించి అఖిలేష్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది ఎన్నికల్లో యూపీలో, దేశంలో బీజేపీని ఓడించడానికి పార్టీ ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టదని అన్నారు

Akhilesh Yadav: పార్టీ మీటింగ్ అయిపోగానే కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డ అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav again takes swipe at Congress

Akhilesh Yadav: తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీతో ఫ్రంట్ ఏర్పాటు చేసుకున్న సమాజ్‭వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. తమ ఫ్రంటులో కాంగ్రెస్ పార్టీ ఉండబోదని స్పష్టం చేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ మీద అఖిలేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం సమాజ్‭వాదీ పార్టీ ఎక్జిక్యూటివ్ మీటింగ్ ముగియగానే మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సంస్థల్ని దుర్వినియోగం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర సంస్థల్ని ఇష్టారీతిన దుర్వినియోగం చేసిందని ఆయన విమర్శించారు.

Bihar: బిహార్ సీఎం నితీశ్ కుమార్‭పై హార్స్ ట్రేడింగ్ ఆరోపణలు చేసిన ఓవైసీ

‘‘గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేసింది. ఇప్పుడు బీజేపీ అదే పని చేస్తోంది. కానీ బీజేపీ దెబ్బకు కాంగ్రెస్ కనిపించకుండా పోయింది. బీజేపీతో పోరాడుతున్న పార్టీల వెంటే ఏజెన్సీలను పంపుతున్నారు. భవిష్యత్తులో బీజేపీకి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది’’ అని అఖిలేష్ అన్నారు. బీజేపీని నిలువరించే ఏకైక రాష్ట్రం యూపీయేనని అన్న అఖిలేష్.. అందుకే దేశం మొత్తం ఇప్పుడు ఎస్పీ వైపు చూస్తోందని అన్నారు.

Kerala: బీజేపీకి మద్దతు ఇస్తామన్న ఆ చర్చి.. క్రైస్తవులకు దగ్గరవ్వాలనుకున్న బీజేపీకి లక్కీ ఛాన్స్

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కేంద్ర సంస్థల దాడులు పెరుగుతాయని ఆయన అన్నారు. “పార్లమెంటరీ ఎన్నికలకు సన్నాహాలు మొదలవుతున్నాయి. కాబట్టి దాడులు పెరగొచ్చు. కానీ ఇది కాషాయ పార్టీకి సహాయం చేయదు” అని అన్నారు. రెండు రోజుల జాతీయ కార్యవర్గంలో ఆమోదించిన రాజకీయ తీర్మానం గురించి అఖిలేష్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది ఎన్నికల్లో యూపీలో, దేశంలో బీజేపీని ఓడించడానికి పార్టీ ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టదని అన్నారు. ఇక యూపీ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పాత్రపైనా విమర్శలు గుప్పించారు.