9 గంటలు చాలు : వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు సమయంపై చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈసీకి లేఖ రాశారు. ప్రతి నియోజకవర్గంలో 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేశారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు సమయంపై

  • Published By: veegamteam ,Published On : May 7, 2019 / 03:50 AM IST
9 గంటలు చాలు : వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు సమయంపై చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈసీకి లేఖ రాశారు. ప్రతి నియోజకవర్గంలో 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేశారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు సమయంపై

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈసీకి లేఖ రాశారు. ప్రతి నియోజకవర్గంలో 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేశారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు సమయంపై ఈసీ  చెబుతున్న లెక్కలు తప్పు అని చంద్రబాబు అన్నారు. 50శాతం వీవీ ప్యాట్ స్పిప్పులు లెక్కించడానికి కేవలం 9 గంటల సమయమే పడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా  ఎన్నికలకు 75 రోజులు సమయం తీసుకోగా లేనిది.. స్లిప్పుల లెక్కింపునకు 6 రోజుల కేటాయిస్తే ఇబ్బంది ఏమిటి అని చంద్రబాబు ఈసీని ప్రశ్నించారు. వీవీ ప్యాట్ స్లిప్పుల్లో తేడాలు వస్తే  100శాతం లెక్కించిన తర్వాతే ఫలితాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ చెప్పుచేతుల్లో కాకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని చంద్రబాబు కోరారు.

ఈసీ.. కొందరి విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని రాజకీయ పార్టీలు, ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయని చంద్రబాబు అన్నారు. వీవీ ప్యాట్, ఈవీఎంలోని ఓట్ల మధ్య డిఫరెన్స్  వస్తే.. వీవీ ప్యాట్ స్లిప్పుల సంఖ్యనే పరిగణలోకి తీసుకుంటామని ఈసీ చెబుతోందన్నారు. 5 పోలింగ్ బూత్ లలో మాత్రమే స్లిప్పులను లెక్కించడం అంటే 2శాతం మాత్రమే అని.. ఈసీ ఈ నిర్ణయంతో  ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని అంగీకరించిందన్నారు. 2శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను మాత్రమే లెక్కించడం ద్వారా మిగిలిన 98శాతంతో జరిగే ట్యాంపరింగ్ ను ఎలా నిరోధిస్తారు  అని చంద్రబాబు ప్రశ్నించారు.