అదృష్టవంతుడు, మళ్లీ వైసీపీలోకి వచ్చిన ఆయనకు సీఎం జగన్ బంపర్ ఆఫర్

  • Published By: naveen ,Published On : September 6, 2020 / 10:21 AM IST
అదృష్టవంతుడు, మళ్లీ వైసీపీలోకి వచ్చిన ఆయనకు సీఎం జగన్ బంపర్ ఆఫర్

రాజకీయాల్లో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. మళ్లీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారడం చాలా కామన్‌. చలమల శెట్టి సునీల్‌ కూడా ఈ కామన్‌ సూత్రాన్నే ఫాలో అయ్యారు. గత ఎన్నికల ముందు వరకూ వైసీపీలో ఉన్నా ఆయన.. జగన్‌కు సన్నిహితంగా ఉండేవారు. అలాంటి వ్యక్తి సడన్‌గా వైసీపీని వదిలి టీడీపీలో చేరారు. కాకపోతే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కదా. దీంతో మళ్లీ ఆయన పాత పార్టీలోకే వచ్చేశారు. పార్టీ మారినా జగన్‌కు సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని నిజం చేశాలే మళ్లీ ఆయన తిరిగి వైసీపీ కండువా కప్పేసుకున్నారు.

వైసీపీలోనే ఉండి ఉంటే ఎంపీగా గెలిచేవారు:
2014లో కాకినాడ ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేసిన సునీల్ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఎంపీగా పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు. నిజానికి పార్టీ మారకుండా ఉంటే వైసీపీ వేవ్‌లో సునీల్ కాకినాడ ఎంపీ అయ్యేవారు. కానీ కాలం కలసి రాకపోతే అలాంటి బుద్ధులే పుడతాయి. టీడీపీలో చేరి టికెట్‌ సాధించి మరీ ఓడిపోయారు. పోనీ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిందా అంటే అదీ లేదు. అందుకే సునీల్ మళ్లీ వైసీపీలో చేరారు. పార్టీలో ముందు నుంచి ఉండటం, జగన్‌తో సత్సంబంధాల నేపథ్యంలో పార్టీలోకి ఎలాంటి అడ్డంకులు లేకుండానే చేరగలిగారు సునీల్‌.

ఎంపీగా గెలవకపోయినా పార్లమెంటులోకి అడుగు పెట్టే చాన్స్:
మరోపక్క, సునీల్‌ డైరెక్ట్‌ ఎలక్షన్లలో ఎంపీగా గెలవలేకపోయినా పార్లమెంటులోకి అడుగు పెట్టే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు వైసీపీలో జరుగుతోంది. జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉండటం, గతంలో పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించారనే అంశాల నేపథ్యంలో సునీల్‌కు వచ్చే రాజ్యసభ ఇస్తారనే టాక్‌ నడుస్తోంది. త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానంలో ఒకటి సునీల్‌కి ఇవ్వడం ఖాయమని పార్టీలోని కీలక నేతలు అంటున్నారు.

మొత్తానికి లోక్‌సభ సభ్యుడిగా ఢిల్లీకి వెళ్లలేకపోయినా.. రాజ్యసభ ద్వారా అయినా ఆ చాన్స్‌ దక్కబోతోందని చెప్పుకుంటున్నారు. పార్టీలు మారినా లక్‌ మాత్రం చలమశెట్టి సునీల్‌ తలుపు తట్టిందని అంటున్నారు. మరి సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.