దెబ్బతిన్న రోడ్లకు రూ. 571 కోట్లు – సీఎం కేసీఆర్

  • Published By: madhu ,Published On : November 28, 2019 / 02:11 PM IST
దెబ్బతిన్న రోడ్లకు రూ. 571 కోట్లు – సీఎం కేసీఆర్

రాష్ట్రంలో ఇటీవలే సంభవించిన వర్షాల కారణంగా రోడ్లు, నేషనల్ హైవేలు దెబ్బతిన్నాయని వెంటనే వీటిని బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వెల్లడించారు. 2019, నవంబర్ 28వ తేదీ గురువారం కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశాలకు సంబంధించిన వివరాలను కేసీఆర్ వెల్లడించారు. 
కేబినెట్‌లో రెండు..మూడు విషయాలపై ప్రధానంగా చర్చించడం జరిగిందన్నారు.

రాష్ట్రంలో ఇటీవలే అధికంగా వర్షాలు కురవడంతో రోడ్లు బాగా దెబ్బతినడం జరిగిందన్నారు. ఆర్ అండ్ బి అధికారులతో చర్చించడం జరిగిందన్నారు. నేషనల్ హైవే..అతీ గతీ లేకుండా..మెంటేన్ లేకపోవడంతో చాలా సమస్యలు ఉత్పన్నమౌతున్నాయన్నారు. తాను గతంలో పర్యటించిన సమయంలో ఈ సమస్యను ప్రధానంగా గుర్తించడం జరిగిందని, తమకు డబ్బులు ఇవ్వాలని గతంలో మంత్రిగా ఉన్న గడ్కరిని అడిగితే..కొన్ని నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ విషయంపై చర్చించడం జరిగిందని తెలిపారు. దెబ్బతిన్న రోడ్లను రెండు, మూడు నెలల్లో బాగు చేయిస్తామని, ఇందుకు రూ. 571 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు సీఎం కేసీఆర్.
Read More : హైదరాబాద్‌లో అభివృద్ధి అంటే..మొదట గుర్తుకొచ్చేది నేనే – బాబు