“Chamchagiri” Remark: రాష్ట్రపతి ముర్ముపై కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు.. నోటీసులు పంపాలని జాతీయ మహిళా కమిషన్ నిర్ణయం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ నేత, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. ‘‘ద్రౌపది ముర్ము జీ వంటి రాష్ట్రపతి ఏ దేశంలోనూ ఉండరు. చెంచాగిరీకి కూడా హద్దులు ఉంటాయి. 70 శాతం మంది ప్రజలు గుజరాత్ ఉప్పునే తింటారని ఆమె ఇటీవల అన్నారు. మీరు నిజంగా ఉప్పు తిని బతుకుతుంటే మీకే ఈ విషయం తెలుస్తుంది’’ అని ఉదిత్ రాజ్ ట్వీట్ చేశారు. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు రావడంతో మరో ట్వీట్ చేశారు.

“Chamchagiri” Remark: రాష్ట్రపతి ముర్ముపై కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు.. నోటీసులు పంపాలని జాతీయ మహిళా కమిషన్ నిర్ణయం

“Chamchagiri” Remark: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ నేత, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. ‘‘ద్రౌపది ముర్ము జీ వంటి రాష్ట్రపతి ఏ దేశంలోనూ ఉండరు. చెంచాగిరీకి కూడా హద్దులు ఉంటాయి. 70 శాతం మంది ప్రజలు గుజరాత్ ఉప్పునే తింటారని ఆమె ఇటీవల అన్నారు. మీరు నిజంగా ఉప్పు తిని బతుకుతుంటే మీకే ఈ విషయం తెలుస్తుంది’’ అని ఉదిత్ రాజ్ ట్వీట్ చేశారు. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు రావడంతో మరో ట్వీట్ చేశారు.

తాను ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధమూ లేదని అన్నారు. అవి తన వ్యక్తిగత వ్యాఖ్యలని చెప్పారు. ‘ఆదివాసి’ పేరిట రాష్ట్రపతి పదవికి ద్రౌపది ముర్ము పోటీ చేశారని, ఆ పేరుతోనే ప్రచారంలో పాల్గొన్నారని అన్నారు. దానికి అర్థం ఇకపై తాను ఆదివాసిని కాదని కాదు కదా? అని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీలు గొప్ప స్థానానికి ఎదిగితే, ఇక తమ సామాజిక వర్గం వారి గురించి వారు మర్చిపోతారని అన్నారు. వారి విషయంలో మౌనంగా ఉంటారని చెప్పారు. ఇటీవల గుజరాత్ పర్యటన సందర్భంగా ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఉదిత్ రాజ్ ఈ విధంగా ట్వీట్లు చేశారు. ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించింది. ఉదిత్ రాజ్ కు నోటీసులు పంపాలని నిర్ణయించింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..