Coronavirus : తెలంగాణాలో హై అలర్ట్..స్కూళ్లు, థియేటర్లు, పబ్‌లు మూసివేత

  • Published By: madhu ,Published On : March 16, 2020 / 01:00 AM IST
Coronavirus : తెలంగాణాలో హై అలర్ట్..స్కూళ్లు, థియేటర్లు, పబ్‌లు మూసివేత

కరోనా వైరస్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జనసమూహాలు ఎక్కువగా ఉండే వాటిని బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా 2020, మార్చి 16వ తేదీ నుంచి స్కూళ్లు, థియేటర్లు, పబ్‌లు బంద్ కానున్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలో మూడు కేసులు నమోదయ్యాయి. వ్యాధి నయం కావడంతో ఇప్పటికే ఒకరిని డిశ్చార్జ్ చేసిన సంగతి తెలిసిందే. 

గాంధీ ఆస్పత్రిలో 100 పడకల ఐసోలేషన్ వార్డు : – 
అయితే..తెలంగాణపై కరోనా ప్రభావం పెద్దగా లేకపోయినా.. కేంద్ర ప్రభుత్వం అదేశాలతో సర్కార్ అలర్ట్ అయ్యింది. ఇప్పటికే 15 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం, సినిమా హాళ్లు, పబ్బులు, బార్లు బంద్ చేయించింది. వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి.. పాజిటివ్ అని తేలితే.. ఐసోలేషన్ వార్డుకు తరలించి వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునే వరకూ చికిత్స చేయించాలని నిర్ణయించుకుంది. ఇక రాష్ట్రంలో ఒక డెత్ కేసు లేకుండా చేయాలని చూస్తున్న ప్రభుత్వం.. దీని కోసం గాంధీ ఆసుపత్రిలో 100 పడకల ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసింది.

తాత్కాలిక ఐసోలేషన్ ఆస్పత్రుల ఏర్పాటు : – 
తెలంగాణతో పోల్చుకుంటే ఇతర రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఒకవేల భవిష్యత్తులో తెలంగాణలో కరోనా పాజటివ్ కేసులు ఎక్కువైతే..వారికి వైద్య పరీక్షలు చేసి చికిత్సలు చేసేందుకు తాత్కాలికంగా ఐసోలేషన్ ఆసుపత్రులను ఏర్పాటు చేసుకొంటోంది. కరోనా అనూమానితులు, బాధితులను జబ్బు నయం అయ్యే వరకూ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు రాష్ట్రంలోనీ వికారాబాద్‌లోని హారితా రిసార్ట్స్‌లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. దీంతోపాటు నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో మరో ఐసోలేషన్ ఆసుపత్రికి, నగర శివారులోని అటవీ ప్రాంతమైన దూలపల్లిలో మరో ఆసుపత్రిని ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం 2 వేల 20 పడకలతో ఈ మూడు ఆసుపత్రులను అందుబాటులో ఉంచేందుకు వైద్య శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు.

విదేశీయుల డేటా ఎక్కడ : – 
ఓ వైపు కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం రాత్రింబగళ్ళు కష్టాపడి కరోనా అనుమానితులకు వైద్యం అందిస్తున్నా ఈ వైరస్‌తో వచ్చే వారిని గుర్తించేందుకు అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు సహకరించడం లేదు. హైదరాబాద్ నగరం నుంచి ఇతర దేశాలకు రోజుకు 3 వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం కరోనా ప్రభావం ఉన్న 7 దేశాల నుంచి వచ్చే వారిపైనే విమానయాశాఖ అధికారులు దృష్టి సారించారు. అయితే వీరికి సంబందించిన డేటాను అందించడం లేదు. ఫలితంగా కరోనా పాజిటివ్ భాదితుల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించలేకపోతున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రత్యేక మానిటరింగ్ సెల్ : – 
దీంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి, కరోనా అనూమాతులను నేరుగా గాంధీకి తరలిస్తున్నారు. ఇక విదేశాలనుంచి హైదరాబాద్ కు వచ్చిన వారి జాబితాకు సేకరిస్తున్నారు. వారి యోగ క్షేమాలను ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు, అడిగి తెలుసుకుంటున్నారు. అయితే కొందరి దగ్గర నుంచి సరైన వివరాలు అందడం లేదని అధికారులు చెబుతున్నారు. 

Read More : ముగియనున్న టి. అసెంబ్లీ సమావేశాలు : నేడు CAAపై వ్యతిరేక తీర్మానం