Bharat Jodo Yatra: కుక్కలు, పందులు, గేదెలు కూడా వచ్చాయి.. భారత్ జోడో యాత్రపై రాహుల్

బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి దేశంలో అల్లర్లు సృష్టిస్తున్నాయని విమర్శలు చేస్తూనే కాంగ్రెస్ మాత్రం ప్రేమను పంచుతుందని చెప్పుకొచ్చారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ 24 గంటలు ధ్వేషాన్నే పంచుతాయని రాహుల్ విమర్శలు చేశారు. ఈ దేశంలో ఒక మనిషి కింద పడితే కులం, మతం, ప్రాంతం, భాష వంటి తేడా చూడకుండా తోటి మనిషి సాయం చేస్తారని, నిజమైన దేశం అదేనని అన్నారు

Bharat Jodo Yatra: కుక్కలు, పందులు, గేదెలు కూడా వచ్చాయి.. భారత్ జోడో యాత్రపై రాహుల్

Cow, buffaloes, pigs, all animals came says Rahul Gandhi about Bharat Jodo Yatra

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలోకి కుక్కలు, పందులు, గేదెలు సహా అనేక జంతువులు వచ్చాయని, అయితే వాటికి ఏమాత్రం హాని జరగలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర దేశ రాజధాని చేరుకున్న సందర్భంగా శనివారం ఎర్రకోట వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమది ప్రేమను పంచడం కోసం సాగుతున్న యాత్రని చెప్పే క్రమంలో మనుషులకే కాదు, జంతువులకు కూడా తమ యాత్రలో హాని జరగలేదని అన్నారు. దేశంలో అధికారంలో ఉన్న పార్టీ విధ్వేషాన్ని రెచ్చగొట్టి అల్లర్లకు పాల్పడుతుందంటూ విమర్శలు చేసిన రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ మాత్రం ప్రేమనే పంచుతుందని అన్నారు.

Bharat Jodo Yatra: మోదీ ప్రభుత్వానికి 24 గంటలూ అదే పని.. కేంద్రంపై రాహుల్ ఫైర్

ఈ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ ‘‘యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు.. ఎవరినైనా ఏ కులమని, మతమని అడిగామా? హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధం వంటి పేర్లెప్పుడైనా వినిపించాయా? లేదంటే ఆడా-మగా అనే పదాలైనా విన్నారా? రంగు, రూపం గురించి కానీ, బట్టల గురించి కానీ అడిగారా?’’ అని రాహుల్ ప్రశ్నించారు. దీనికి సభికులు ‘‘లేదు’’ అంటూ సమాధానం చెప్పారు. అనంతరం రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘‘ఈ దేశం ఒక్కటే. దేశంలోని ప్రజలూ ఒక్కటే. కాంగ్రెస్ ప్రేమను మాత్రమే పంచుతుంది. భారత్ జోడో యాత్రతో ప్రేమను మాత్రమే పంచాము. ఈ యాత్రలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు’’ అని అన్న రాహుల్.. ఈ యాత్రలోకి కుక్కలు వచ్చినా వాటికి కూడా హాని జరలేదని అన్నారు.

MCD: దమ్ముంటే ఎదురుగా వచ్చి పోటీ చేయండి.. ఢీల్లీ మేయర్ ఎన్నికపై బీజేపీకి ఆప్ ఛాలెంజ్

‘‘కుక్కలు, పందులు, గేదెలు కూడా వచ్చాయి. అన్ని జంతువులు వచ్చాయి. కానీ ఒక్క జంతువుకు కూడా హాని జరగలేదు. మనుషులే కాదు, జంతువులకు కూడా మేము హాని చేయము’’ అని రాహుల్ అన్నారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి దేశంలో అల్లర్లు సృష్టిస్తున్నాయని విమర్శలు చేస్తూనే కాంగ్రెస్ మాత్రం ప్రేమను పంచుతుందని చెప్పుకొచ్చారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ 24 గంటలు ధ్వేషాన్నే పంచుతాయని రాహుల్ విమర్శలు చేశారు. ఈ దేశంలో ఒక మనిషి కింద పడితే కులం, మతం, ప్రాంతం, భాష వంటి తేడా చూడకుండా తోటి మనిషి సాయం చేస్తారని, నిజమైన దేశం అదేనని అన్నారు. కానీ దేశంలోని నలుమూలలకు కాషాయ పార్టీ ధ్వేషాన్ని రెచ్చగొట్టిందని, ఆ ధ్వేషాన్ని భారత్ జోడో యాత్ర చెరిపేసి ప్రేమను పంచుతోందని రాహుల్ అన్నారు.