ShivSena: శివసేన తనకే దక్కినా షిండేలో వదలని భయం.. సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు

మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వాదనలు వినాలని ఆ కేవియట్‭లో షిండే కోరారు. మరికొద్ది నెలల్లోనే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఇక కొద్ది రోజుల్లో ముంబై మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన గుర్తుపై మళ్లీ రగడ లేకుండా ఉండేందుకు షిండే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ShivSena: శివసేన తనకే దక్కినా షిండేలో వదలని భయం.. సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు

Eknath Shinde's Latest Move After Big Win Against Team Thackeray

ShivSena: దాదాపు ఎనిమిది నెలల ఉత్కంఠ, వాదులాటల అనంతరం శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం స్పష్టం చేసింది. దీనిపై అధికార ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయినప్పటికీ షిండేకు ఒక భయం వదల్లేదు. పార్టీని హస్తగతం చేసుకోవడానికి ఇటు షిండే వర్గం, అటు ఉద్ధవ్ థాకరే వర్గం తీవ్ర ప్రయత్నాలు చేశాయి. అయితే ఈసీఐ నిర్ణయంతో షిండేకు ఊరటే లభించినప్పటికీ, దీనిపై ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టులో సవాలు చేస్తారనే భయం పట్టుకుంది.

Bihar: నితీశ్ ప్రధాని ప్రయత్నాలపై రవిశంకర్ ఎద్దేశా.. విపక్షలు కలిస్తే బీజేపీ 100 దాటదంటూ నితీశ్ కౌంటర్

అంతే, ఉద్ధవ్ కంటే ముందే సుప్రీంకోర్టుని షిండే ఆశ్రయించారు. శివసేన పేరు, గుర్తుపై ఎన్నికల కమిషన్‌ తీర్పును ఉద్ధవ్‌ ఠాక్రే సవాల్‌ చేయవచ్చని సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేశారు. శివసేన పార్టీ, గుర్తు విషయమై ఏదైనా ఉత్తర్వు జారీ చేసే ముందు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వాదనలు వినాలని ఆ కేవియట్‭లో షిండే కోరారు. మరికొద్ది నెలల్లోనే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఇక కొద్ది రోజుల్లో ముంబై మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన గుర్తుపై మళ్లీ రగడ లేకుండా ఉండేందుకు షిండే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

BRS MLA Sayanna: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

కాగా, 1996లో బాల్‭థాకరే శివసేన పార్టీని స్థాపించారు. అయితే తండ్రి స్థాపించిన పార్టీని కోల్పోవడం ఉద్ధవ్ థాకరేకు అతిపెద్ద ఎదురుదెబ్బ. ఈ విషయమై ఉద్ధవ్ థాకరే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అసలైన శివసేన తనకే రావాలంటూ ఆయన చేసిన విజ్ణప్తిని ఎన్నికల సంఘం గుర్తించకపోవడంతో పాటు దాన్ని ప్రత్యర్థి, మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే వర్గానికి కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎన్నికల సంఘం బానిసలా మారిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తొందరలో ముంబై మున్సిపాలిటీ (బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్)కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఇక అక్కడే తేల్చుకుంటామని ఉద్ధవ్ సవాల్ విసిరారు.

Madhya Pradesh: శివరాత్రి వేడుకలో కుల కులాల మధ్య గొడవలు.. 14 మంది తీవ్ర గాయాలు

పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఉన్న జెండాను, ఎన్నికల గుర్తు షిండే వర్గానికి వెళ్లింది. మహారాష్ట్రలోని శివసేనలో తిరుగుబాటు జరిగిన ఎనిమిది నెలల హైడ్రామా అనంతరం ఏక్‌నాథ్ షిండే వేసిన దావాకు అనుకూలంగా ఎన్నికల సంఘం తీర్పు వెలువడడం గమనార్హం. ఈ మేరకే ఈసీఐ త్రిసభ్య కమిషన్‌ శుక్రవారం 78 పేజీల ఆదేశాల్లో తిరుగుబాటు తర్వాత ముఖ్యమంత్రి అయిన షిండేకు 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ గెలిచిన ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, పార్టీ సాధించిన ఓట్లలో ఇది 76 శాతమని కమిషన్ పేర్కొంది. ఉద్ధవ్‌ వైపు 23.5శాతం మందే ఉన్నట్లు వెల్లడించింది.

ShivSena: షిండే భారీ స్కాం, శివసేన కోసం ₹ 2,000 కోట్ల డీల్.. ఉద్ధవ్ వర్గం తీవ్ర ఆరోపణలు

శివసేనలోని 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మందిని, 18 మంది ఎంపీల్లో 13 మందిని షిండే తన వైపుకు తిప్పుకుని ఉద్ధవ్ థాకరే మీద తిరుగుబావుటా ఎగరవేశారు. దీంతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం కొద్ది రోజులకే భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనూహ్యంగా ఎవరి అంచనాలకు కూడా అందకుండా ముఖ్యమంత్రిగా ఏక్‭‭నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు.