అంతా సిద్ధం : CM KCR కరీంనగర్ టూర్ షెడ్యూల్

  • Published By: madhu ,Published On : December 30, 2019 / 12:34 AM IST
అంతా సిద్ధం : CM KCR కరీంనగర్ టూర్ షెడ్యూల్

సీఎం కేసీఆర్‌ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోవడంతోపాటు… మున్సిపల్‌ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయనున్నారు. మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చేస్తున్న మొదటి పర్యటన ఇదే కావడంతో  పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.

2019, డిసెంబర్ 30వ తేదీ సోమవారం వేములవాడ, మిడ్‌మానేరు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నందున అధికారులు, పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. 
*10.30 గంటలకు వేములవాడ రాజరాజేశ్వర స్వామికి ఆలయానికి వెళుతారు. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.

* వేములవాడలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా పరిశీలిస్తారు. అధికారులతో సమీక్ష. 
* తర్వాత..మధ్యమానేరు ప్రాజెక్టును సీఎం సందర్శన. 
* మిడ్ మానేరులో నీటి నిల్వ, తరలింపుపై అధికారులతో చర్చ. 
* కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు కూడా వెళ్లనున్నట్లు సమాచారం. 

 

* కాళేశ్వరం జలాలు మిడ్ మానేరుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏరియల్ వ్యూ ద్వారా సందర్శించవచ్చని తెలుస్తోంది. 
* తీగల గుట్టపల్లిలోని తెలంగాణ భవన్‌కు వెళ్లనున్న సీఎం.
* అక్కడ పార్టీ శ్రేణులతో సమావేశమై మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. 
* పార్టీ నేతలతో సమావేశం అనంతరం అక్కడే భోజనంచేసి తిరిగి హైదరాబాద్‌ రానున్నారు సీఎం కేసీఆర్.
 

ప్రాజెక్టు మొదటిసారి పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరి జలకళతో ఉట్టిపడుతోంది. ఈ తరుణంలో అక్కడ సీఎం పర్యటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలోనే ఆయన… కాళేశ్వరం ప్రాజెక్టులోని 10వ ప్యాకేజీని అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది.  ఆయనను కలిసేందుకు పార్టీ క్యాడర్ రెడీ అవుతోంది. 

Read More : AP మూడు రాజధానులపై మంత్రి KTR ట్వీట్