తండ్రి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న తనయుడు, నిజామాబాద్ బీజేపీలో రివెంజ్ పాలిటిక్స్

రాజకీయాల్లో పైకి ఎదగాలంటే ప్రత్యర్థులనే కాదు.. సొంత పార్టీ నేతలను తొక్కేసుకుంటూ పోవలసిందే. రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. ఒకసారి ప్రజాప్రతినిధిగా గెలిచిన

  • Published By: veegamteam ,Published On : March 17, 2020 / 05:22 AM IST
తండ్రి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న తనయుడు, నిజామాబాద్ బీజేపీలో రివెంజ్ పాలిటిక్స్

రాజకీయాల్లో పైకి ఎదగాలంటే ప్రత్యర్థులనే కాదు.. సొంత పార్టీ నేతలను తొక్కేసుకుంటూ పోవలసిందే. రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. ఒకసారి ప్రజాప్రతినిధిగా గెలిచిన

రాజకీయాల్లో పైకి ఎదగాలంటే ప్రత్యర్థులనే కాదు.. సొంత పార్టీ నేతలను తొక్కేసుకుంటూ పోవలసిందే. రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. ఒకసారి ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత రెండోసారి కూడా గెలవడం అంటే అద్భుతమనే చెప్పుకోవాలి. అప్పుడెప్పుడో తన తండ్రిని ఓడించిన వ్యక్తిపై ఇప్పుడు రివెంజ్‌ తీర్చుకోవాలని భావిస్తున్నారట. అనుకున్నది సాధించేశారు. ఒకే పార్టీలో ఉంటూ రివెంజ్‌ తీర్చేసుకున్నారు. వారిద్దరికీ ఇప్పుడు అసలు పడడం లేదు.. మరి వారిద్దరిలో ఎవరిది పై చేయి కానుంది?

నిజామాబాద్‌ బీజేపీలో గ్రూపు రాజకీయాలు:
నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుత ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ రెండు గ్రూపులకు నాయకత్వం వహిస్తున్నారు. మూడేళ్ల కిందట బీజేపీలో చేరిన ధర్మపురి అర్వింద్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బస్వా లక్ష్మీనారాయణను నియమించేలా చేశారు. ఇందూరులో బీజేపీ అంటే యెండల, యెండల అంటే బీజేపీ అనే రికార్డును ఇప్పుడు అర్వింద్‌ మార్చేశారట. ఈ మాటలు అనేందుకు పార్టీ కేంద్రంగా జిల్లాలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం అని చెబుతున్నారు. అసలు నిజామాబాద్ జిల్లాలో యెండల, ధర్మపురి అర్వింద్ మధ్య గ్రూపు రాజకీయాలకు అజ్యం పడింది అప్పట్లోనేనని అంటున్నారు. 

రెండుసార్లు యెండల చేతిలో ఓడిపోయిన డీఎస్‌:
ధర్మపురి శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు పర్యాయాలు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఆయన్ను యెండల లక్ష్మీనారాయణ ఓడించారు. అప్పటి నుంచే ఆయన్ను ఓడించేందుకు అర్వింద్ సిద్ధమయ్యారట. 2017 సెప్టెంబర్ 17న అర్వింద్ బీజేపీలో చేరారు. అర్వింద్ ఆ పార్టీలో చేరే నాటికి యెండల రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఇందూరు లోకసభ ఎంపీగా, 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవి‌చూశారు. 

2019లో అరవింద్‌ తరఫున ప్రచారం చేయని యెండల:
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో యెండల తరఫున అర్వింద్ ప్రచారంలో పాల్గొనకపోవడం వల్లే, 2019లో పార్లమెంటు ఎన్నికల్లో అర్వింద్ తరఫున యెండల ప్రచారం చేయలేదని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. అయితే, యెండల నాయకత్వానికి అర్వింద్ చెక్ పెట్టారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ గ్రూపు రాజకీయాలపై ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలకు ఫిర్యాదులు అందాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రూపు రాజకీయాలు సమసిపోయి, సమిష్టిగా అందరూ కలిసి పార్టీ బలోపేతం చేసేలా అధిష్టానం ఏమైనా చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.

Also Read | ఇంటర్ పరీక్షలకు వెళ్తూ విద్యార్థి మృతి