చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లు, కర్రలు : అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత

టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతి పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓవైపు స్వాగతాలు, మరోవైపు నిరసనలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రైతులు రెండు వర్గాలుగా

  • Published By: veegamteam ,Published On : November 28, 2019 / 05:07 AM IST
చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లు, కర్రలు : అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత

టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతి పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓవైపు స్వాగతాలు, మరోవైపు నిరసనలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రైతులు రెండు వర్గాలుగా

టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతి పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓవైపు స్వాగతాలు, మరోవైపు నిరసనలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రైతులు రెండు వర్గాలుగా విడిపోయారు. చంద్రబాబుకి అనుకూలంగా ఓ వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం నిరసనకు దిగాయి. పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబు గో బ్యాక్ అని ఓ వర్గం రైతులు నినాదాలు చేయడం టెన్షన్ కు దారితీసింది. మరోవైపు వెంకటాయపాలెం దగ్గర టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. 

కాగా సీడ్ యాక్సెస్ రోడ్ లో కొందరు ఆందోళనకారులు చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై చెప్పులు, రాళ్లు, కర్రలు విసిరారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ అనుకూల రైతులు నినాదాలు చేయగా, జై చంద్రబాబు అంటూ టీడీపీ అనుకూల రైతులు నినాదాలు చేశారు.

గురువారం(నవంబర్ 28,2019) చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు వెంట టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కాగా చంద్రబాబుకి మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా కొందరు రైతులు ఆందోళనకు దిగడంతో.. చంద్రబాబు పర్యటన రచ్చరచ్చగా మారింది. చంద్రబాబు పర్యటన ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.

అటు చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ అమరావతిలో బ్యానర్లు వెలిశాయి. రాజధాని ప్రాంతంలో పర్యటించే అర్హత చంద్రబాబుకి లేదంటూ.. తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్ లో రాజధాని ప్రాంత కూలీల పేరుతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. మరోసారి చంద్రబాబు తమ జీవితాలతో ఆడుకోవద్దని కోరారు. ”వాణిజ్య స్థలాల విషయంలో రైతులను మోసం చేశారు.. గడిచిన ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఉచిత విద్య, వైద్యం ఒక్కరికి కూడా కల్పించలేదు” అంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు.