హైదరాబాద్ మెట్రోకు రెండేండ్లు..ఎన్నో రికార్డులు

  • Published By: madhu ,Published On : November 29, 2019 / 09:34 AM IST
హైదరాబాద్ మెట్రోకు రెండేండ్లు..ఎన్నో రికార్డులు

హైదరాబాద్‌ మెట్రో ఆల్‌టైమ్‌ రికార్డ్‌ సృష్టిస్తోంది. 56 కిలోమీటర్లు.. 810 సర్వీసులు.. ప్రతి రోజూ దాదాపు 4 లక్షల మంది ప్రజలు జర్నీ చేస్తుంటారు. మెట్రోకు రెండేళ్లగా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. హైదరాబాద్ మెట్రో రైల్‌ ప్రారంభమై రెండేళ్లు పూర్తైన రోజే.. మరో రూట్ అందుబాటులోకి వచ్చింది. హైటెక్‌సిటీ – రాయదుర్గం మధ్య సర్వీస్‌లను 2019, నవంబర్ 29వ తేదీ శుక్రవారం మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 

పబ్లిక్‌ అండ్‌ ప్రైవేట్‌ పార్టిసిపేషన్‌ పద్ధతిలో నిర్మించిన మెట్రో రైల్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా రికార్డు సాధించింది. అలాగే దేశంలో ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద నెట్‌వర్క్‌ కలిగి ఉన్న ప్రాజెక్టుగా కూడా హైదరాబాద్‌ మెట్రో పేరు దక్కించుకుంది.  గత రెండు సంవత్సరాల్లో 12 కోట్ల 5లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు. అంతే కాకుండా మొత్తం రెండు సంవత్సరాల కాలంలో 4లక్షలకు పైన ట్రిప్పులతో.. 86 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన ఘనత మెట్రోకే దక్కుతుంది. 

సిటీలో మెట్రో రైల్‌‌‌‌ రెండేండ్లు పూర్తి చేసుకుంది. 2017 నవంబర్‌‌‌‌ 28న ప్రధాని నరేంద్ర మోడీ మియాపూర్​లో సర్వీసులు ప్రారంభించారు. నవంబర్‌‌‌‌ 29 నుంచి నాగోలు టు మియాపూర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జంట నగరాల పరిధిలో మొత్తం 66  మెట్రో స్టేషన్లతో 72 కిలో మీట‌‌ర్ల మేర మెట్రో సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కారిడార్‌‌ 1లో మియాపూర్ నుంచి ఎల్బీన‌‌గ‌‌ర్ వ‌‌ర‌‌కు 29 కిలో మీట‌‌ర్లు, కారిడార్2 లో జేబీఎస్ నుంచి ఫ‌‌ల‌‌క్​నుమా వ‌‌ర‌‌కు15 కిలో మీట‌‌ర్లు, కారిడార్ 3లో నాగోలు నుంచి రాయ‌‌దుర్గం వ‌‌ర‌‌కు 28 కిలోమీట‌‌ర్లు మెట్రో నిర్మించాలని ప్రతిపాదించారు.
Read More : ప్రియాంకరెడ్డి కేసు: KTR ట్వీట్..సబితా..కలెక్టర్ పరామర్శ
సాధారణ రోజుల్లో ప్రతి ఆరు నిమిషాలకు ఒక రైలును నడిపిస్తూ పీక్‌‌‌‌ అవర్స్​లో ప్రతి మూడు నిమిషాలకో ట్రైన్​తో సిటీజనాల కష్టాలు తీరుస్తోంది. ఇక నిన్నటి వరకూ సాగిన ఆర్టీసీ సమ్మె కాలంలో.. భాగ్యనగర ప్రజలు ఇబ్బందులు పడకుండా మెట్రో ఎంతో సహాయ పడింది. మధ్యలో చిన్న చిన్న అవరోధాలు ఎదురైనా అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు దూసుకుపోతోంది. ఇక కారిడార్‌‌‌‌2లో భాగమైన జేబీఎస్‌‌‌‌ ఎంజీబీఎస్‌‌‌‌ వచ్చే నెలలో మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్‌‌ పెడుతూ.. సౌండ్ పొల్యూషన్‌కి దూరంగా.. స్మార్ట్‌‌, ఎకో ఫ్రెండ్లీ విధానంతో హైదరాబాద్ మెట్రో దూసుకుపోతోంది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైటెక్‌సిటీ -రాయదుర్గం మెట్రో మార్గం కూడా అందుబాటులోకి వచ్చింది.