Rahul Press meet: నేను సావర్కర్ కాదు, గాంధీని.. ‘సారీ’పై రాహుల్ సెటైర్లు

అనర్హత వేటు గురించి ప్రశ్నించగా న్యాయపరమైన అంశాలను తాను మాట్లాడబోనని, ఏమైనా ఉంటే తన లీగల్ టీం ద్వారా తెలుసుకోవాలని రాహుల్ సూచించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడ్డం కోసం నేను ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఓబీసీ, అనర్హత వేటు వగైనా అన్నీ ముందుకు తెస్తున్నారని రాహుల్ విమర్శలు గుప్పించారు.

Rahul Press meet: నేను సావర్కర్ కాదు, గాంధీని.. ‘సారీ’పై రాహుల్ సెటైర్లు

Rahul Press meet: తాను సావర్కర్ కాదని, గాంధీనని రాహుల్ గాంధీ అన్నారు. విదేశాల్లో దేశ రాజకీయాలపై మాట్లాడడం పట్ల రాహుల్ క్షమాపణలు చెప్పాలన్న అధికార పక్ష డిమాండ్ మీద ప్రశ్నించగా రాహుల్ ఈ విధంగా సమాధానం చెప్పారు. తన మీద వేసిన అనర్హత వేటుపై శనివారం రాహుల్ ప్రెస్‭మీట్ ద్వారా స్పందించారు. ఈ సందర్భంలో ఒక జర్నలిస్ట్ స్పందిస్తూ ‘‘విదేశాల్లో భారత రాజకీయాలపై స్పందించారు. దానికి అధికార పక్షం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఆ క్షమాపణేదో చెప్తే సరిపోతుంది కదా?’’ అని ప్రశ్నించారు.

Congress Protest : రాహుల్ గాంధీపై అనర్హతను నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు

దీనికి రాహుల్ సమాధానం ఇస్తూ ‘‘క్షమాపణలు చెప్పడానికి నేను సావర్కర్ కాదు. గాంధీని. గాంధీ ఎప్పుడూ క్షమాపణలు చెప్పడు. ఎందుకంటే మేం దేశం కోసం పోరాడుతాం. దేశం కోసం మాట్లడతాం. దేశం కోసం ఆలోచిస్తాం’’ అని అన్నారు. ఇక తనపై అనర్హత వేటుకు కారణం ప్రధానమంత్రి నరేంద్రమోదీ భయపడుతున్నారని, తాను పార్లమెంటులో మాట్లాడితే అదానీ గురించి మరిన్ని విషయాలు బయటికి వస్తాయనే కారణంతోనే తన మీద ఈ చర్య తీసుకున్నట్లు రాహుల్ పేర్కొన్నారు.

Rahul Press meet: ఏం చేసుకుంటారో చేసుకోండి, తగ్గేదే లేదు.. అనర్హతపై మోదీకి రాహుల్ ఛాలెంజ్

ఇక అనర్హత వేటు గురించి ప్రశ్నించగా న్యాయపరమైన అంశాలను తాను మాట్లాడబోనని, ఏమైనా ఉంటే తన లీగల్ టీం ద్వారా తెలుసుకోవాలని రాహుల్ సూచించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడ్డం కోసం నేను ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఓబీసీ, అనర్హత వేటు వగైనా అన్నీ ముందుకు తెస్తున్నారని రాహుల్ విమర్శలు గుప్పించారు.