సీఎం జగన్ సంచలన నిర్ణయం : రాజధానిపై రెఫరెండం

ఏపీ రాజధాని మార్పు అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజధాని మార్పుపై జోరుగా వార్తలు వస్తున్నాయి. ఏపీ రాజధానిని అమరావతి నుంచి మరో చోటికి షిఫ్ట్ చేసే యోచనలో జగన్

  • Published By: veegamteam ,Published On : August 23, 2019 / 04:33 AM IST
సీఎం జగన్ సంచలన నిర్ణయం : రాజధానిపై రెఫరెండం

ఏపీ రాజధాని మార్పు అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజధాని మార్పుపై జోరుగా వార్తలు వస్తున్నాయి. ఏపీ రాజధానిని అమరావతి నుంచి మరో చోటికి షిఫ్ట్ చేసే యోచనలో జగన్

ఏపీ రాజధాని మార్పు అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజధాని మార్పుపై జోరుగా వార్తలు వస్తున్నాయి. ఏపీ రాజధానిని అమరావతి నుంచి మరో చోటికి షిఫ్ట్ చేసే యోచనలో జగన్ సర్కార్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజధానిగా అమరావతి సేఫ్ ప్లేస్ కాదని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. రాజధాని మారడం ఖాయం అనే చర్చకు తెరతీశాయి. దీనిపై రాజకీయవర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

రాజధానిపై ప్రజాభిప్రాయం(రెఫరెండం) ద్వారా అంతిమ నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజధానిగా అమరావతిని కొనసాగించాలా లేక మరో చోటికి షిఫ్ట్ చేయాలా అనేది ప్రజాభిప్రాయం ద్వారా తెలుసుకుంటారట. ప్రభుత్వానికి చెందిన కార్యాలయాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేయకూడదనే భావనలో సీఎం జగన్ ఉన్నారట. గతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ అభిప్రాయం కూడా ఇదే.

చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కమిటీ అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. విజయవాడ, గుంటూరు మధ్య కృష్ణా నది ఒడ్డులో రాజధాని నిర్మాణానికి పూనుకుంది. అన్ని కార్యాలయాలను ఒకే చోట నిర్మించాలనుకుంది. వరదలు వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా చంద్రబాబు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. సీఎం జగన్ మాత్రం.. సేఫ్ సైడ్ ఆలోచిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

రాజధాని నిర్మాణం కోసం అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూముల వివరాలను ఇవ్వాలని సీఆర్డీఏ కమిషనర్ ని సీఎం జగన్ ఆదేశించారు. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల నుంచి స్వచ్ఛందంగా భూములను సేకరించిందా లేక బలవంతంగా లాక్కుందా అనే విషయాన్ని బయటపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధానిలో నిర్మిస్తున్న ప్రభుత్వ సంస్థల పక్కనే ప్రైవేట్ సంస్థలకు, వ్యక్తులకు ఏ మేరకు స్థలాన్ని కేటాయించారనే విషయంపైనా నివేదిక ఇవ్వాలని సీఆర్డీఏ కమిషనర్ ని సీఎం జగన్ ఆదేశించారు. సీఆర్డీఏ కమిషనర్ నివేదిక అందాక రాజధాని విషయమై సీఎం జగన్ ప్రజాభిప్రాయం కోరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Also Read : మరో షాక్ : టీడీపీ ఎమ్మెల్యే ఆఫీస్ కి కూల్చివేత నోటీసులు