కారెక్కి షో చేసి..హీరో అనుకుంటే ఎలా ? రేవంత్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

  • Published By: madhu ,Published On : March 14, 2020 / 11:16 AM IST
కారెక్కి షో చేసి..హీరో అనుకుంటే ఎలా ? రేవంత్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

కాంగ్రెస్ ఎంపీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సీనియర్ నేతలు ఆయన్ను కడిగిపారేస్తున్నారు. వ్యక్తిగతమైన అంశాలను పార్టీకి రుద్దడం ఏంటీ ? ఆరోపణలు వస్తే నిరూపించుకోవాలంటూ..ఆయనపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. మొన్న జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయగా…కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పలు విమర్శలు గుప్పించారు.

తాజాగా..కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. 2020, మార్చి 14వ తేదీ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ వ్యవహార శైలితో పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని, ఆయన ప్రవర్తన మార్చుకోవాలని కోమటిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మీడియా సమావేశం అనంతరం చిట్ చాట్ చేస్తూ..రేవంత్‌పై విరుచుకపడ్డారు. రేవంత్ మెచ్యూర్టీ పొలిటీషియన్‌గా ప్రవర్తించాలని, చిన్న పిల్లాడి మెంటాల్టీగా ఉందని వ్యాఖ్యానించారు.

See Also | ఢిల్లీలో వడగళ్ళ వాన..భారీగా నిలిచిపోయిన నీరు

ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడమేంటీ ? కారెక్కి షో చేసి..హీరో అనుకుంటే ఎలా ? అని ప్రశ్నించారు. గోపాలన్ పల్లి భూ స్కాం బయటపడగానే..జీవో 111 గుర్తుకొచ్చిందా ? ఈ జీవోపై ఇప్పటి దాక ఏం చేశారు ? అని నిలదీశారు. ఎవరు ఫామ్ హౌస్‌లు కట్టుకుంటే ఏంటీ ? టీ షర్ట్ వేసుకుని చలో ప్రగతి భవన్ అనడం ఏంటీ అని తెలిపారు. గోపన్ పల్లి భూ ఆక్రమణలు ఎదుర్కొంటున్న రేవంత్…చిన్న పిల్లల చేష్టలు మానుకోవాలని సూచించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 

ఫామ్ హౌస్‌పై డ్రోన్ ఎగురవేసిన కేసులో ఎంపీ రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటికే గోపన్ పల్లి భూములను ఆక్రమించారంటూ..ఈయనపై ఆరోపణలు వచ్చాయి. వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి మరో వివాదాస్పదమైన అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి రాద్ధాంతం చేయడం ఏంటీ ? అని నేతలు అగ్గిలమీద గుగ్గిలమవుతున్నారు. ఏకపక్షంగా ఏదైనా ఒక్క విషయంపై ఒక్కడే ఎలా పోరాడుతాడని, పార్టీలో చర్చించి అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని సీనియర్లు అంటున్నారు. 

Read More : కరోనా వైరస్‌పై కీలక నిర్ణయం : మార్చి 31 వరకు హైదరాబాద్ షట్ డౌన్