మూడు గంటలకే విశాఖ లాంగ్ మార్చ్.. జనసేన క్లారిటీ

  • Published By: madhu ,Published On : November 2, 2019 / 10:14 AM IST
మూడు గంటలకే విశాఖ లాంగ్ మార్చ్.. జనసేన క్లారిటీ

ఏపీ రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ..భవన నిర్మాణ కార్మిక సంఘాలకు సంఘీభావంగా జనసేన నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్ యదావిధిగా కొనసాగుతుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు. 2019, నవంబర్ 03వ తేదీ ఆదివారం విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే..దీనికి పోలీసుల పరిష్మన్ ఇవ్వలేదని, కార్యక్రమం ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు జనసేన కీలక నేతలు నాదెండ్ల మనోహర్, జేడీ లక్ష్మీనారాయణలు మీడియా ముందుకొచ్చారు. 

మధ్యాహ్నం 3 గంటలకు లాంగ్ మార్చ్ ప్రారంభం కానుందని, మద్దిలపాలెం తెలుగు విగ్రహం నుంచి మహిళా కళాశాల వరకు జరుగుతుందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేసేందుకు లాంగ్ మార్చ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. లాంగ్ మార్చ్‌కు అనుమతులున్నాయని, పోలీసులు ఎలాంటి ఇబ్బందులు పెట్టడం లేదన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, సీనియర్ నేతలు, జనసైనికులు పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారన్నారని తెలిపారు నాదెండ్ల. రాజకీయాల్లో మార్పు కోసం, పవన్‌కు మద్దతు తెలియచేయడానికి మహిళలు ఉత్సాహం చూపుతున్నట్లు తెలిపారాయన. అయితే..లాంగ్ మార్చ్‌పై దుష్ర్పాచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అక్టోబర్ 28వ తేదీన ఫర్మిషన్ కోసం దరఖాస్తు చేయగా..అక్టోబర్ 30వ తేదీన పోలీసుల ఫర్మిషన్, జీవీఎంసీ అనుమతినివ్వడం జరిగిందంటూ పత్రాలు చూపించారు. నవంబర్ 03వ తేదీ ఆదివారం జరిగే కార్యక్రమం యదావిధిగా జరుగుతుందని..కానీ.. స్థలాల మార్పు జరిగితే జరొగచ్చన్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు అండగా..భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా తాము ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు నాదెండ్ల. 
Read More : లాంగ్ మార్చ్ కాదు..రాంగ్ మార్చ్ – ఏపీ మంత్రి అనీల్