ఆ ట్విట్టర్ అకౌంట్లు ఫేక్..చర్యలు తీసుకోవాలి – సచిన్

  • Published By: madhu ,Published On : November 28, 2019 / 09:28 AM IST
ఆ ట్విట్టర్ అకౌంట్లు ఫేక్..చర్యలు తీసుకోవాలి – సచిన్

తన కుమారుడు అర్జున్, తన కూతురు సారాకు ట్విట్టర్ అకౌంట్లు లేవని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వెల్లడించారు. వీరి మీద ఉన్న ట్విట్టర్ అకౌంట్లు ఫేక్ అని స్పష్టం చేశారు. వాటిపై చర్యలు తీసుకోవాలంటూ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను కోరారు జూనియర్‌ టెండూల్కర్‌ పేర మీద ఉన్న ట్విట్టర్ అకౌంట్‌ తన కుమారుడు అర్జున్‌ది కాదని, జూనియర్‌ టెండూల్కర్‌ పేరుతో కొంతమంది ప్రముఖలపై వ్యతిరేకంగా ట్వీట్లు వస్తున్న నేపథ్యంలో సచిన్‌ స్పందించాడు.

దీనిపై సాధ్యమైనంత త్వరగా ట్విట్టర్ ఇండియా చర్యలు తీసుకోవాలని కోరారు. మహారాష్ట్ర రాజకీయాలపై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు మద్దతిస్తున్నానంటూ జూనియర్ టెండూల్కర్ పేరిట ఒక ట్వీట్ వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఐయామ్ విత్ ఫడ్నవీస్ అనే హ్యాష్ ట్యాగ్‌తో జూనియర్ టెండూల్కర్ అకౌంట్‌లో ఇది వెలుగు చూసింది. అయితే..ఇది సచిన్ కుమారుడు అర్జున్ చేసిదంటూ పుకార్లు షికారు చేశాయి. దీంతో సచిన్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 
Read More : ఇండియాలో హాకీ ప్రపంచ కప్
ఇక జూనియర్ టెండూల్కర్ విషయానికి వస్తే..అండర్ 16, అండర్ 19 స్థాయిలో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తూ..తండ్రికి తనయుడిగా రాణిస్తున్నాడు. గత సంవత్సరం శ్రీలంకతో జరిగిన అండర్ – 19 మ్యాచ్‌లకు భారత్ తరపున ఆడాడు. 
I wish to clarify that my son Arjun & daughter Sara are not on Twitter.
The account @jr_tendulkar is wrongfully impersonating Arjun and posting malicious tweets against personalities & institutions. Requesting @TwitterIndia to act on this as soon as possible.