కాంగ్రెస్‌కు మరో షాక్: టీఆర్ఎస్‌లోకి పాలేరు ఎమ్మెల్యే

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ లో క్యూ కట్టారు. ఇప్పటికే సీనియర్ నేత,

  • Published By: veegamteam ,Published On : March 14, 2019 / 09:33 AM IST
కాంగ్రెస్‌కు మరో షాక్: టీఆర్ఎస్‌లోకి పాలేరు ఎమ్మెల్యే

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ లో క్యూ కట్టారు. ఇప్పటికే సీనియర్ నేత,

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ లోకి క్యూ కట్టారు. ఇప్పటికే సీనియర్ నేత, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కారెక్కాలని డిసైడ్ అయ్యారు. ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరో ఎమ్మెల్యే గులాబీ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి.. టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు.
Read Also : టీడీపీలో సీటుపై ఫైటింగ్ : రాయపాటి రాజీనామా అంటూ ప్రచారం

ఉపేందర్ రెడ్డి.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. పార్టీలో చేరికపై ఆయనతో చర్చించినట్టు సమాచారం. ఉపేందర్ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై గెలిచారు.