Rahul Gandhi: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రాహుల్ అభ్యంతరం.. ఓవైసీ కూడా

కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కావటానికి డేట్ ఫిక్స్ అయ్యింది. మే 28(2023)న ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. 2020డిసెంబర్‭లో సెంట్రల్ విస్తటకు భూమి పూజ చేశారు ప్రధాని మోదీ

Rahul Gandhi: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రాహుల్ అభ్యంతరం.. ఓవైసీ కూడా

New Parliament Building: నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తుండడంపై కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనాన్ని భారత రాష్ట్రపతి ప్రారంభించాలని, ప్రధానమంత్రి కాదని ఆయన అన్నారు. ఆదివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాహుల్ స్పందిస్తూ ‘‘నూతన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభించబడాలి. ప్రధానమంత్రి కాదు’’ అని హిందీలో ట్వీట్ చేశారు.

Opposition Parties Unity : విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నాలు.. కేజ్రీవాల్ ని కలిసిన నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్

ఇక ఇదే విషయమై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం స్పందించారు. రెండు రోజుల క్రితం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ప్రధానమంత్రి పార్లమెంటును ప్రారంభిండం ఏంటి? ఆయన శాసన సభకు కాదు కార్యనిర్వాహక వర్గానికి అధిపతి. రాజ్యంగం ప్రకారం.. మనకు అధికారాల విభజన స్పష్టంగా ఉంది. పార్లమెంట్‭కు అధిపతులు లోక్‭సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. వారిచేత ప్రారంభించవచ్చు. పార్లమెంట్ నూతన భవనం ప్రజల సొమ్ముతో నిర్మించారు. ప్రధానమంత్రి తన స్నేహితుల డబ్బుతో నిర్మించినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నారు?’’ అని ట్వీట్ చేశారు.

Vishnukumar Raju : జగన్ పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేస్తాం : విష్ణుకుమార్ రాజు

భారత ప్రజాస్వామ్య చరిత్రలో అపురూప ఘట్టం ఆవిష్కృతం కానుంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కావటానికి డేట్ ఫిక్స్ అయ్యింది. మే 28(2023)న ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. 2020డిసెంబర్‭లో సెంట్రల్ విస్తటకు భూమి పూజ చేశారు ప్రధాని మోదీ. రెండున్నరేళ్లలోపే కొత్త పార్లమెంట్ నిర్మాణం ప్రారంభానికి సిద్ధమైంది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిదేళ్లు పూర్తైన సందర్భంగా పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభం కానుంది. దీంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలోనే జరుగనున్నాయి.