Maharashtra Politics: శివసేన ఆస్తులు షిండేకు ఇచ్చేయాలంటూ పిటిషన్.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన సుప్రీంకోర్టు

ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలను తన వెంట తీసుకుని వెళ్లి తిరుగుబాటుకు దిగారు ఏక్‌నాథ్ షిండే. అనంతరం ఉద్ధవ్ ప్రభుత్వం కూలిపోగానే దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి అయ్యారు.

Maharashtra Politics: శివసేన ఆస్తులు షిండేకు ఇచ్చేయాలంటూ పిటిషన్.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన సుప్రీంకోర్టు

Maharashtra Politics: శివసేన ఆస్తులు ఉద్ధవ్ థాకరే వర్గం నుంచి ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే వర్గానికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‭ను దేశ అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నర్సింహ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై స్పందిస్తూ ఆ ఆస్తులు అడగడానికి మీరెవరంటూ పిటిషన్ దారు ఆశిష్ గిరిని ప్రశ్నించింది. ఇప్పటికే షిండే, థాకరే వర్గాల మధ్య దాఖలైన అనేక పిటిషన్లు సుప్రీం విచారణలో ఉన్నాయి. వీటికి తోడు గిరి తాజా పిటిషన్ దాఖలు చేశారు.

SCO Meeting: ఢిల్లీలో జరుగుతున్న రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొననున్న పాకిస్తాన్

పార్టీ షిండే చేతికి వచ్చిన కారణంగా.. ఆ పార్టీకి సంబంధించిన ఆస్తులు సైతం షిండే వర్గానికే చెందాలని పిటిషన్లో గిరి కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘‘ఇదేం పిటిషన్? ఇంతకీ నువ్వెవరు? ఇలాంటి విజ్ణప్తులను కోర్టు ఎంకరేజ్ చేయదు’’ అని చెప్తూనే పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబంధించి ఉద్ధవ్ థాకక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గాల మధ్య దాఖలైన క్రాస్ పిటిషన్‌పై మార్చి 16న అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్ చేసింది.

Manipur: బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై గిరిజనుల ఆగ్రహం.. ఏకంగా సీఎం పాల్గొనే సమావేశానికే నిప్పు, ఉద్రిక్త పరిస్థితులు

ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలను తన వెంట తీసుకుని వెళ్లి తిరుగుబాటుకు దిగారు ఏక్‌నాథ్ షిండే. అనంతరం ఉద్ధవ్ ప్రభుత్వం కూలిపోగానే దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే శివసేన పార్టీ, గుర్తు తమదంటే తమదేనని పొట్లాటకు దిగాయి. కొద్ది రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై స్పష్టతనిచ్చింది. ఎక్కువ మంది చట్టసభ సభ్యులు షిండే వైపు ఉన్నందున, ఓటింగ్ శాతాన్ని లెక్కగట్టి శివసేన షిండే వర్గానికే చెందుతుందని ప్రకటించింది. ఇక పార్టీతో పాటు పార్టీ గుర్తు దక్కించుకున్న షిండే వర్గం.. పార్టీ ఆస్తులు కూడా తమకే చెందాలని కోర్టును ఆశ్రయించాయి.