టచ్ లో 20మంది వైసీపీ ఎంపీలు : త్వరలో బీజేపీలోకి

ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న బీజేపీ.. అందుకు తగ్గట్టు వ్యూహాలు రచిస్తోంది. ఇతర పార్టీల

10TV Telugu News

ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న బీజేపీ.. అందుకు తగ్గట్టు వ్యూహాలు రచిస్తోంది. ఇతర పార్టీల

ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న బీజేపీ.. అందుకు తగ్గట్టు వ్యూహాలు రచిస్తోంది. ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొందరికి గాలం వేసే పనిలో పడింది. బీజేపీ నేత, ఎంపీ సుజనాచౌదరి జోరు పెంచారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ శ్రేణులకు ఆందోళన కలిగేలా మాట్లాడుతున్నారు.

20మంది వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారని సుజనా చౌదరి కామెంట్ చేశారు. బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారని చెప్పారు. తమతో సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. అయితే వారిని ఇప్పటికిప్పుడు బీజేపీలో చేర్చుకోము అని తెలిపారు. తగిన సమయం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు పార్టీలో చేర్చుకుంటామని కామెంట్ చేశారు.

వైసీపీ, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని.. బీజేపీలోకి వచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీశాయి. బీజేపీతో టచ్ లో ఉన్నది ఎవరు అని కొందరు ఆరా తీస్తుంటే.. ఇదంతా అవాస్తవం అని, బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని టీడీపీ, వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఏపీలో రాజకీయంగా బలపడాలని చూస్తున్న బీజేపీ అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు.