పవన్ క్లోజ్ ఫ్రెండ్ అలీ.. జగన్ పార్టీలో జాయిన్

  • Published By: madhu ,Published On : January 4, 2019 / 05:15 AM IST
పవన్ క్లోజ్ ఫ్రెండ్ అలీ.. జగన్ పార్టీలో జాయిన్

విజయవాడ : అలీ.. పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్ అయ్యింది. 2019, జనవరి 9వ తేదీ ముహూర్తం ఖరారైంది. ఏ మాత్రం ఆలస్యం లేదు మిత్రమా అన్నట్లు.. ఆప్తమిత్రుడు, క్లోజ్ ఫ్రెండ్ అయిన పవన్ కల్యాణ్ ను వదిలేసి మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం చర్చనీయాంశం అయ్యింది. అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ జాయినింగ్ న్యూస్ కంటే.. పవన్ కల్యాణ్ ను కాదని.. ఆయన పార్టీలో జాయిన్ కాకపోవటమే పెద్ద టాపిక్ అయిపోయింది. అన్ని పార్టీల్లో కామన్ డిస్కషన్ ఇదే కావటం విశేషం.
ఇచ్చాపురంలో జాయిన్ :
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలీ జాయిన్ కావటం వారం క్రితమే కన్ఫామ్ అయ్యింది. జగన్ ను స్వయంగా కలిసి గంట సమయం చర్చించారు. స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత ఎంట్రీకి ఓకే చెప్పారు. వారం క్రితమే అధికారిక లాంఛనాలు పూర్తి కావాల్సి ఉన్నా.. ఇచ్చాపురంలో జగన్ పాదయాత్ర ముగింపు బహిరంగ సభకి మరింత హైప్ క్రియేట్ చేసే ఉద్దేశంతో పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆ రోజు బహిరంగ సభలోనే జగన్ చేతుల మీదుగా పార్టీలో జాయిన్ కావాలని షెడ్యూల్ ఫిక్స్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్. 
జనసేనలోకి ఎందుకు వెళ్లలేదు :
యాక్టర్ అలీ ఏది చేసినా ముందుచూపుతో ఉంటారనే టాక్ సినీ ఇండస్ట్రీలో ఉంది. కింద నుంచి వచ్చిన అనుభవం, సినీ ఇండస్ట్రీలో పరిస్థితులపై పూర్తి అవగాహనతో ఉంటాడని చెబుతుంటారు మిత్రులు. ఏ విషయం అయినా జాగ్రత్తగా ఆలోచించి మరీ నిర్ణయం తీసుకుంటారని.. ఏదీ తొందరపడరని అంటారు. ఫ్రెండ్ ఫ్రెండే.. పేకాట పేకాటే అన్నట్లు.. సినీ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ క్లోజ్ ఫ్రెండే కావొచ్చు.. మంచి ఆప్తుడే కావొచ్చు.. రాజకీయాల్లో కాదు కదా..