టీడీపీ దత్తపుత్రుడు : జనసేనానీ లాంగ్ మార్చ్‌పై వైసీపీ విమర్శలు

  • Edited By: madhu , November 3, 2019 / 11:45 AM IST
టీడీపీ దత్తపుత్రుడు : జనసేనానీ లాంగ్ మార్చ్‌పై వైసీపీ విమర్శలు

జనసేనానీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్‌పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రెండున్నర కిలోమీటర్లు నడిచే పవన్ ఇసుక ఆందోళనను..లాంగ్ మార్చ్ అంటుంటే..ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. లాంగ్ మార్చ్ పేరిట 1934లో చైనా కమ్యూనిస్టు ప్రజా విమోచన సైన్యం..మావో నాయకత్వంలో 10 వేల కి.మీటర్ల నడిచి అధికారం సాధించిందన్నారు. 

మరోవైపు పవన్ కళ్యాణ్ టీడీపీ దత్త పుత్రుడని అభివర్ణించారు మంత్రి ఆదిమూలపు సురేశ్. రాజకీయ లబ్ది కోసం పవన్ లాంగ్ మార్చ్ అంటూ విమర్శించారు. ఇసుక కొరత కృత్రిమంగా ఏర్పడిందని తెలిపారు. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని..ఓపిక పట్టాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన ఇసుక దోపిడీని బయటపెడుతామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇసుకను తక్కువ ధరకు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని మరోసారి స్పష్టం చేశారు. అయితే..ఇక్కడ ఇసుక అందుబాటులోకి రాకూడదని ప్రతిపక్షాల కోరిక విమర్శించారు. 
Read More : మార్చ్ టెన్షన్ : ఆంధ్రా యూనివర్సిటీ గేట్లు క్లోజ్..విద్యార్థుల ఆగ్రహం
ఏపీలో ఇసుక కొరతపై ప్రతిపక్షాలు ఆందోళన బాట పట్టాయి. అందులో భాగంగా జనసేన పార్టీ..నవంబర్ 03వ తేదీ ఆదివారం విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించింది. ఈ మార్చ్‌కు టీడీపీ మద్దతు పలికింది. 

లాంగ్ మార్చ్ పేరుతో 1934 లో చైనా కమ్యూనిస్ట్ ప్రజా విమోచన సైన్యం మావో నాయకత్వంలో పది వేల కిలోమీటర్లు నడిచి అధికారం సాధించింది. రెండున్నర కిలోమీటర్లు నడిచే @PawanKalyan ఇసుక ఆందోళనను లాంగ్ మార్చ్ అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు.