బీజేపీతో స్నేహం, ఎన్డీయేలో చేరికపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

బీజేపీతో స్నేహం, ఎన్డీయేలో వైసీపీ చేరిక గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎన్డీయేలో చేరుతుందని, కేంద్ర కేబినెట్ లో వైసీపీకి మంత్రి పదవి ఇస్తారని వార్తలు

  • Published By: veegamteam ,Published On : February 15, 2020 / 09:51 AM IST
బీజేపీతో స్నేహం, ఎన్డీయేలో చేరికపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

బీజేపీతో స్నేహం, ఎన్డీయేలో వైసీపీ చేరిక గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎన్డీయేలో చేరుతుందని, కేంద్ర కేబినెట్ లో వైసీపీకి మంత్రి పదవి ఇస్తారని వార్తలు

బీజేపీతో స్నేహం, ఎన్డీయేలో వైసీపీ చేరిక గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎన్డీయేలో చేరుతుందని, కేంద్ర కేబినెట్ లో వైసీపీకి మంత్రి పదవి ఇస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాష్ట్రానికి మేలు జరుగుతుంది అంటే కచ్చితంగా ఎన్డీయేలో చేరే అవకాశం గురించి పరిశీలిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాష్ట్రం కోసం ఎవరి గడ్డమైనా పట్టుకుని బతిమాలుతామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు ఘర్షణ పడాలని ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే మాత్రం ఉపేక్షించేది లేదని బొత్స స్పష్టం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స.. ఎన్డీయేలో చేరికపై స్పందించారు. 

రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎన్డీయేలో చేరతామని బొత్స అన్నారు. బీచ్ రోడ్ లోనే పురపాలక శాఖ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో స్టేట్ అర్బన్ డెవలప్ మెంట్ ప్రదాన కార్యాలయాన్ని నిర్మిస్తామని బొత్స వెల్లడించారు. ఎన్డీయేలో వైసీపీ చేరనుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కేంద్ర కేబినెట్ లోకి వైసీసీని తీసుకుంటారనే వార్తలూ వస్తున్నాయి. బీజేపీ కీలక నేతలతో కొందరు వైసీపీ కీలక నేతలు టచ్ లో ఉన్నారు. సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని జగన్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రెండు పార్టీల మధ్య స్నేహం ఖాయమని అంటున్నారు. అయితే ఇంతవరకు వైసీపీ నుంచి ఎలాంటి అఫీషియల్ స్టేట్ మెంట్ లేదు.

ఈ సమయంలో మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీయేలో చేరే అవకాశం పరిశీలిస్తామని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీతో జగన్ దోస్తీ కోరుకుంటున్నారా అనే ప్రచారం జరుగుతోంది. ఒక వేళ బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటే.. అది బీజేపీకి లాభమా? లేక వైసీపీకా? అన్నది కాలమే తేల్చాలి.

Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు