Shirdi Temple Reopen: బాబా భక్తులకు శుభవార్త.. రీ ఓపెన్‌కు షిర్డీ ఆలయం సిద్ధం!

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని తిరిగి తెరిచేందుకు.. ట్రస్ట్ నిర్వాహకులు నిర్ణయించారు. కరోనా నిబంధనలను అమలు చేస్తూ.. భక్తులను సాయిబాబా దర్శనాలకు అనుమతించనున్నారు.

Shirdi Temple Reopen: బాబా భక్తులకు శుభవార్త.. రీ ఓపెన్‌కు షిర్డీ ఆలయం సిద్ధం!

Shiridi

షిర్డీ సాయిబాబా భక్తులకు శుభవార్త. కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. గత ఏప్రిల్ 5న ఆలయాన్ని మూసివేసిన ట్రస్ట్ నిర్వాహకులు.. తిరిగి సాయి మందిరాన్ని భక్తులకు అందుబాటులోకి తెస్తున్నారు. రేపటి నుంచే.. అంటే.. అక్టోబర్ 7 గురువారం నుంచి.. భక్తలను దర్శనానికి అనుమతించనున్నట్టు ప్రకటించారు.

అయితే.. కోవిడ్ నిబంధనలు పాటిస్తామని స్పష్టం చేశారు. పదేళ్ల లోపు చిన్నారులు.. 65 ఏళ్లు దాటిన వృద్ధులు.. గర్భిణులను ఆలయానికి అనుమతించబోమన్నారు. భక్తులు సహకరించాలని కోరారు.

మరోవైపు.. మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతోంది. మంగళవారం 2 వేల 401 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 39 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. అయితే.. రెండో దశతో పోలిస్తే ఇప్పుడు కాస్త కేసులు తగ్గుముఖం పట్టిన కారణంగా.. షిర్డీ సాయిబాబా ఆలయాన్ని అధికారులు.. రీ ఓపెన్ చేస్తున్నారు. కరోనా నిబంధనలను మాత్రం కచ్చితంగా అమలు చేస్తామన్నారు.