Indrakeeladri: దుర్గమ్మ దర్శనం కోసం పోటెత్తిన భక్తులు.. ముగిసిన ఉత్సవాలు

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మూడు రోజుల పాటు వైభవంగా సాగిన శాకంబరీ దేవి ఉత్సవాలు ముగిశాయి. వేదపండితులు యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలు ముగిసినట్లుగా ప్రకటించారు.

Indrakeeladri: దుర్గమ్మ దర్శనం కోసం పోటెత్తిన భక్తులు.. ముగిసిన ఉత్సవాలు

Indra Keeladhri (2)

Three-day Shakambari Devi festivities: ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మూడు రోజుల పాటు వైభవంగా సాగిన శాకంబరీ దేవి ఉత్సవాలు ముగిశాయి. వేదపండితులు యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలు ముగిసినట్లుగా ప్రకటించారు.

ఇంద్రకీలాద్రిపై మూడు రోజుల పాటు కూరగాయలు, పండ్లతో దర్శనమిచ్చిన దుర్గమ్మ ఉత్సవాలు చివరి రోజు కావడంతో శాకంబరీ దేవి రూపంలో దర్శనమిచ్చారు. దుర్గమ్మ దర్శనం కోసం చివరిరోజు భక్తులు పోటెత్తారు.

వివిధ రకాల పండ్లు, కూరగాయలతో అమ్మవారిని అలంకరించగా.. ఉత్సవాలలో భాగంగా కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్ వ్యాపారులు ఎనిమిది టన్నుల వివిధ రకాల పండ్లను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా పండ్ల మార్కెట్ ఉపాధ్యక్షులు రాయపరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ దుర్గమ్మ ఆశీస్సులతో మార్కెట్లో వ్యాపారం చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. దుర్గమ్మ పట్ల వారి భక్తిభావాన్ని ప్రదర్శించుకున్నారు.

కరోనా వైరస్ బారిన పడకుండా, కరోనా ప్రభావం తమ వ్యాపారంపై పడకుండా చూడాలంటూ అమ్మవారని కోరుకున్నారు. గత ఏడేళ్ల నుంచి ప్రతి సంవత్సరం శాకాంబరీ ఉత్సవాల్లో భాగంగా ఏడెనిమిది టన్నుల పండ్లు అమ్మవారికి సమర్పిస్తున్నట్లు వ్యాపారులు వెల్లడించారు. వ్యాపారులు ప్రతి ఒక్కరు తమ వంతుగా పండ్లు అందజేశారని, ఇకముందు కూడా ఇలానే అమ్మవారికి పండ్లు సమర్పిస్తామని అన్నారు.