TTD : ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం శ్రీయాగం
శ్రీ యాగం కారణంగా జనవరి 20 నుంచి 27వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేయడం జరిగిందన్నారు. జనవరి 20, 21, 27వ తేదీల్లో బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు...

Tiruchanur Padmavathi Ammavari Temple : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీయాగం నిర్వహించనున్నారు. మొత్తం ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగనుంది. జనవరి 21వ తేదీ నుంచి జనవరి 27వ తేదీ వరకు కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో ఏకాంతంగా ఈ యాగం జరుగనుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం ఈ యాగం నిర్వహిస్తున్నట్లు, యాగ కార్యక్రమాలను భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో వీక్షించవచ్చన్నారు.
Read More : RGV : కొడాలి నానికి సపోర్ట్ చేస్తూ వర్మ ట్వీట్లు
జనవరి 21న మొదటిరోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు యాగశాలలో హోమాలు, చతుష్టానార్చన, అగ్ని ప్రతిష్ట, నిత్యపూర్ణాహుతి, నివేదన, వేద విన్నపం, మహామంగళహారతి నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు చతుష్టానార్చన, శ్రీయాగం హోమాలు, లఘుపూర్ణాహుతి, మహానివేదన, వేద విన్నపం, మహా మంగళ హారతి చేపట్టి అమ్మవారి ఉత్సవర్లను సన్నిధిలోకి వేంచేపు చేస్తారు. జనవరి 22 నుండి 26వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీయాగం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Read More : International Flights: అంతర్జాతీయ విమానాలు రద్దు.. ఫిబ్రవరి 28వరకూ ఇంతే
జనవరి 27న చివరి రోజు ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు చతుష్టానార్చన, హోమాలు, మహాప్రాయశ్చిత్త హోమం, మహాశాంతి హోమం నిర్వహిస్తారు. ఉదయం 8.30 నుండి 9 గంటల వరకు మహాపూర్ణాహుతి చేపడతారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు అభిషేకం మరియు అవభృతం నిర్వహిస్తారు. జనవరి 20వ తేదీ గురువారం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తామన్నారు. జనవరి 20న గురువారం సాయంత్రం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు ఆర్జిత సేవలు రద్దు చేస్తునట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. శ్రీ యాగం కారణంగా జనవరి 20 నుంచి 27వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేయడం జరిగిందన్నారు. జనవరి 20, 21, 27వ తేదీల్లో బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అర్చకులు పి.శ్రీనివాసన్ ఈ యాగానికి ప్రధానాచార్యులుగా వ్యవహరిస్తారు.
1Kirak RP : కిరాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్ ఫొటోలు
2Texas school shooting: తెలివైన పిల్ల.. రక్తాన్ని ఒంటికి పూసుకొని ప్రాణాలు దక్కించుకుంది..
3Facebook : ఫేస్బుక్లో మీ పోస్టు.. ఎవరికి కనిపించాలో మీరే కంట్రోల్ చేయొచ్చు..!
4Delhi IAS Couple : పెంపుడు కుక్క వాకింగ్ కోసం స్టేడియం ఖాళీ చేయించిన ఐఏఎస్ జంట బదిలీ
5Delhi riots: ఇంటికొచ్చిన ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు.. స్థానికుల ఘన స్వాగతం
6Vivo T2X Smartphone : జూన్ 6న వస్తోంది.. ముందే లీకైన వివో T2X ఫీచర్లు..!
7Gautham : టెన్త్ పాసైన గౌతమ్.. గర్వపడుతున్నాము అంటూ.. జర్మనీలో పార్టీ చేసుకుంటున్న మహేష్ ఫ్యామిలీ..
8Leopard Burnt: చిరుతను సజీవ దహనం చేసిన గ్రామస్తులు.. 150 మందిపై కేసు
9Honey trap case: నెట్ బ్యాలెన్స్‌కు డబ్బులు లేవని నమ్మించింది.. రూ.2.50 లక్షలు మాయం చేసింది ..
10Karan Johar : తారలు తళుక్కుమన్న వేళ.. కరణ్ జోహార్ బర్త్‌డే సెలబ్రేషన్స్..
-
Mangalore university: మంగళూరు యూనివర్సిటీలో ముసుగుపై నిషేధం
-
WhatsApp : వాట్సాప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఇక ఆ మెసేజ్‌లన్నీ సేవ్ చేయొచ్చు..!
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?