IPL 2022: వచ్చే సీజన్‌కు మనీశ్ పాండే కెప్టెన్‍‌గా..

ఐపీఎల్ 2021 సీజన్‌ను కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. బయోబబుల్ ఏర్పాటు చేసి అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న తరుణంలో రోజుల వ్యవధిలోనే 3ఫ్రాంచైజీల ప్లేయర్లకు వైరస్ సోకింది. దీంతో తప్పనిపరిస్థితుల్లో బీసీసీఐ లీగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది.

IPL 2022: వచ్చే సీజన్‌కు మనీశ్ పాండే కెప్టెన్‍‌గా..

Ipl 2022

IPL 2022: ఐపీఎల్ 2021 సీజన్‌ను కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. బయోబబుల్ ఏర్పాటు చేసి అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న తరుణంలో రోజుల వ్యవధిలోనే 3ఫ్రాంచైజీల ప్లేయర్లకు వైరస్ సోకింది. దీంతో తప్పనిపరిస్థితుల్లో బీసీసీఐ లీగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. మళ్లీ ఈ షార్ట్ ఫార్మాట్ దేశీ వాలీలీగ్ చూడాలంటే సంవత్సరం వరకూ ఆగక తప్పదు మరి..

ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు జరగనున్న మెగా వేలం గురించి ఇప్పటి నుంచే విశ్లేషణలు మొదలయ్యాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ మనీష్ పాండే‌కు వచ్చే సీజన్‌లో మంచి డిమాండ్ ఉందని సమాచారం.

పరిస్థితులకు తగ్గట్లు మైదానంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే కెప్టెన్ ముఖ్య లక్షణం. ముంబై ఇండియన్స్ 5 సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ 3 సార్లు టైటిల్ గెలవడంలో ఆయా జట్ల కెప్టెన్లు ధోనీ, రోహిత్ శర్మ కీలకపాత్ర పోషించారు.

నాయకత్వ లేమితో పంజాబ్ కింగ్స్, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ కొన్నేళ్లుగా సతమతమవుతున్నాయి. దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక జట్టుకు మేటి కెప్టెన్సీతో ఎన్నో టైటిల్స్ అందించిన మనీష్ పాండే కోసం వచ్చే సీజన్‌లో ఫ్రాంచైజీలు పోటీ పడుతాయని విశ్లేషకులు అంటున్నారు.

ముఖ్యంగా కేకేఆర్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలు ఫ్యూచర్ కెప్టెన్ కోసం మనీష్ పాండేను తీసుకునే అవకాశం ఉందంటున్నారు. పాండే పెర్ఫామెన్స్‌ పట్ల హైదరాబాద్ కూడా అసంతృప్తితో ఉంది.