Anil Kumble: కోచ్ పదవిపై అనిల్ కుంబ్లే నిరాసక్తి.. విదేశీయుల కోసం బీసీసీఐ వెదుకులాట

రవిశాస్త్రి తర్వాత ఆ పదవి అందుకోవడానికి అనిల్ కుంబ్లే నిరాసక్తిగా ఉన్నాడు. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ దీనిపై చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నప్పటికీ సాధ్యపడే అవకాశాలు లేవు.

Anil Kumble: కోచ్ పదవిపై అనిల్ కుంబ్లే నిరాసక్తి.. విదేశీయుల కోసం బీసీసీఐ వెదుకులాట

Anil Kumble

Anil Kumble: రవిశాస్త్రి తర్వాత ఆ పదవి అందుకోవడానికి అనిల్ కుంబ్లే నిరాసక్తిగా ఉన్నాడు. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ దీనిపై చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నప్పటికీ సాధ్యపడే అవకాశాలు లేనట్లు కనిపిస్తుంది. దీంతో బీసీసీఐకి మళ్లీ విదేశీ కోచ్‌ల కోసం ఎదురుచూడటం తప్పడం లేదు.

టీమిండియా కోచ్ గా రవిశాస్త్రి ప‌ద‌వీ కాలం కొద్ది రోజుల్లో ముగియనుండగా ఆ పదవి ఖాళీ కానుంది. కొత్త కోచ్ కోసం వెతుకులాటలో భాగంగా గ‌తంలో టీమిండియా కోచ్‌గా వ్యవహరించిన అనిల్ కుంబ్లేను అనుకున్నారు. దీనికి కేవలం గంగూలీ మాత్రమే మద్ధతు ఇస్తుండటం, కుంబ్లే కోచ్ ప‌ద‌విపై ఆస‌క్తి చూప‌కపోవడం వంటి అంశాలు కోచ్ గా విదేశీ వ్యక్తి వస్తాడనే సూచనలు చూపిస్తున్నాయి.

ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ కథనం ప్రకారం.. గంగూలీ త‌ప్ప బీసీసీఐ పెద్ద‌లు కూడా కుంబ్లే వైపు ఆసక్తి చూపడం లేదు. కారణం గతంలో కోచ్ చరిత్ర గొప్పగా లేకపోవడం. మ‌ళ్లీ పాత టీమ్‌తో ప‌ని చేయడానికి కుంబ్లే అనాసక్తితో ఉన్నాడట. దాదా మాత్ర‌మే అత‌ని పేరు ప్ర‌తిపాదించడంతో పాటు మిగిలిన వారు వ్య‌తిరేకించారు అని బోర్డు అధికారి అన్న‌ట్లు ఐఏఎన్ఎస్ తెలిపింది.

………………………………………………..: రూ. 500 ఇస్తే మన ఏపీలో ప్రెసిడెంట్ మెడల్ ఇస్తారు!

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కోచ్‌గా కుంబ్లే పెద్ద‌గా సాధించిందేమీ లేదు. ల‌క్ష్మ‌ణ్‌కు దక్కుతుందా అని చూస్తే అలా కూడా ఏ మాత్రం పాజిటివ్ అంశాలు కనిపించలేదు. మ‌రో నెల రోజుల స‌మ‌యంలో ఏమైనా జరగొచ్చనే వార్తలు లేకపోలేదు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో విదేశీ కోచ్ వ‌చ్చే అవ‌కాశాలే ఎక్కువ‌గా కనిపిస్తున్నాయి.